Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నాగచైతన్యతో విడాకులు తీసుకుని నాలుగేళ్లు అయిన తర్వాత ఆమె ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru)ను వివాహం చేసుకుంది. డిసెంబర్ 1వ తేదీ ఉదయం కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలోని లింగ భైరవి సన్నిధిలో సంప్రదాయ భూత శుద్ధి పద్ధతిలో వీరి వివాహం జరిగింది.
అత్యంత కొద్ది మంది సన్నిహితుల మధ్య వీరు ఒక్కటయ్యారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను సామ్ ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. ఈ వేడుకలో సమంత కట్టూ బొట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయ కంచిపట్టు చీర కట్టులో సామ్ మెరిసిపోయింది. ముఖ్యంగా ఆమె చేతికి ఉన్న రింగ్ (Wedding Ring) అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ డైమండ్ రింగ్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపుతున్నారు. అది ఓ ప్రత్యేకమైన రింగ్‌గా తెలిసింది.
జ్యువెలరీ వ్యాపారి ప్రియాంషు గోయెల్ తెలిపిన వివరాల ప్రకారం.. అది పోట్రెయిట్-కట్ డైమండ్ (portrait-cut diamond) రింగ్. ఇది పలుచని గాజు పలకలా ఉండే వజ్రం. దీనిని ప్రత్యేకంగా కట్ చేస్తారు. మొఘల్ కాలంలో తొలిసారి ఈ రకమైన డిజైన్‌తో ఉంగరం తయారుచేశారు. దీన్ని బలం, తేజస్సు, స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారట. ఈ రింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సమంత వేలికి కనిపించింది. దీంతో వీరి ఎంగేజ్మెంట్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే జరిగినట్లు తాజా టాక్. ఈ ఉంగరానికి ఎంత ప్రత్యేకత ఉందో.. ధర కూడా అదే రేంజ్లో ఉంది. జ్యువెలరీ వ్యాపారుల ప్రకారం.. దీని ధర రూ.1.5 కోట్లు అని తెలిసింది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ భార్య ముంతాజ్‌కు ఈ డిజైన్ ఉంగరాలంటే చాలా ఇష్టమని చరిత్రకారులు చెబుతున్నారు.
Also Read..
Samantha | రెండో పెళ్లి తర్వాత సమంతపై నెగెటివిటీ.. పర్సనల్ మేకప్ స్టైలిస్ట్ విలన్ అనేసింది ఏంటి?
Poonam Kaur | పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ సోషల్ మీడియాలో హల్చల్ .. టార్గెట్ సమంతనేనా?