Poonam Kaur | హీరోయిన్గా అంత సక్సెస్‌లు సాధించకపోయినా, సోషల్ మీడియాలో తన వ్యాఖ్యలతో తరచూ వివాదాలకు కారణమవుతున్న పూనమ్ కౌర్ మరోసారి ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలతో హాట్‌టాపిక్‌గా మారింది. ఆమె తాజా ట్వీట్ ప్రస్తుతం నెటిజన్ల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది.పూనమ్ కౌర్ తన ట్వీట్లో.. నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరేవాళ్ల కొంప కూలుస్తావా… బాధాకరం. మళ్లీ ఆమె బాగా శక్తివంతమైంది, బాగా చదువుకున్నది, అత్యంత ప్రాధాన్యత గల మనిషిగా కీర్తిస్తూ పెయిడ్ PR క్యాంపెయిన్లు… డబ్బులు ఉంటే బలహీనమైన, ఆశపడే మగాళ్లు చాలా మంది వస్తారు అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది.
ఈ ట్వీట్లో ఎవరిపేరూ ప్రస్తావించకపోయినా, ఆమె మాటల నేపథ్యం, టైమింగ్‌ను బట్టి ఇది సమంత రూత్ ప్రభును ఉద్దేశించినదేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సమంత రూత్ ప్రభు దర్శకుడు రాజ్ నిడిమోరును డిసెంబర్ 1న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రాజ్ నిడిమోరుకు ఇదివరకే పెళ్లి జరిగి, పిల్లలు కూడా ఉన్నారు. సమంతతో రిలేషన్షిప్ మొదలైన తర్వాత తన మొదటి భార్య శ్యామలా దేవికి విడాకులు ఇచ్చినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో, పూనమ్ చేసిన ట్వీట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
పూనమ్ ట్వీట్ సమంతని ఉద్దేశించే చేసిందని నెటిజన్లలో పెద్ద చర్చ జరుగుతోంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత మళ్లీ పెళ్లి చేసుకున్నా, ఆమె కోసం మరొక కుటుంబం చెల్లా చెదురైందని, ఇప్పుడు శ్యామలా దేవి పరిస్థితి ఏంటి? అంటూ పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. పూనమ్ కౌర్ మరోసారి చేసిన సంచలన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారగా, దీనిపై సమంత లేదా ఆమె టీమ్ స్పందిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.