ఆదివారం 17 జనవరి 2021
Cinema - Nov 24, 2020 , 16:16:47

'క‌మిట్ మెంట్' తేజస్వికి హెల్ప్ అవుతుందా..?

'క‌మిట్ మెంట్' తేజస్వికి హెల్ప్ అవుతుందా..?

ప‌లు చిన్న చిత్రాల్లో హీరోయిన్ గా న‌టించి..ఇప్పుడు  క‌మిట్‌మెంట్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది టాలీవుడ్ భామ తేజ‌స్వి మ‌డివాడ‌. ఈ బ్యూటీ కొన్నాళ్లుగా స‌రైన హిట్స్ లేక‌పోవ‌డంతో..బోల్డ్ కంటెంట్ తో ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రించేందుకు వ‌స్తుంది. హాట్ హాట్ లుక్స్ లో అందాలు ఆర‌బోస్తూ..లిప్ లాక్ స‌న్నివేశాల‌తో వ‌చ్చిన ట్రైల‌ర్ ఇప్ప‌టికే ట్రెండింగ్ అయింది. బోల్డ్ కామెంట్స్ తో త‌ర‌చూ వార్త‌ల్లో నిలిచే ఈ సుంద‌రి ఎలాగైనా ఈ సినిమాతో కొట్టాల‌ని గ్గామ‌ర్ ను ఒల‌క‌బోస్తుంది. తేజ‌స్వి స్టిల్స్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి.

కెరీర్‌లో ఎలాగైనా నిల‌దొక్కుకోవాల‌ని భావిస్తున్న తేజ‌స్వికి  క‌మిట్ మెంట్ సినిమా కెరీర్ లో ఎంత‌వ‌ర‌కు ఉప‌యోగ‌ప‌డుతుందనే ప్ర‌శ్నకు స‌మాధానం దొర‌కాలంటే మ‌రికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ల‌క్ష్మీకాంత్ చెన్నా డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో తేజ‌స్వితోపాటు అన్వేషిజైన్‌, ర‌మ్య ప‌సుపిలేటి, సిమ‌ర్ సింగ్‌, మేగంటి శ్రీకాంత్‌, అభ‌య్ రెడ్డి, సూర్య శ్రీనివాస్‌, త‌నిష్క్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. డిసెంబ‌ర్ 25న విడుద‌ల కానుంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.