Bakasura Restaurant | ప్రవీణ్ , హర్ష చెముడు లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం బకాసుర రెస్టారెంట్. ఎస్జే శివ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఆగస్టు 8న ప్రేక్షకుల ముందుకు రాగా.. మిక్స్డ్ టాక్ రాబట్టుకుంది. ఆ తర్వాత ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీ మంచి స్పందన రాబట్టుకుంది. తెలుగు హార్రర్ కామెడీ మూవీగా వచ్చిన ఈ చిత్రంపై పాపులర్ బాలీవుడ్ యాక్టర్ కన్ను పడిందన్న వార్త ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది.
ఇంతకీ ఆ నటుడు ఎవరనే కదా మీ డౌటు. రాజ్ కుమార్ రావు.. బకాసుర రెస్టారెంట్ హిందీ రీమేక్‌లో రాజ్‌కుమార్ రావు నటించబోతున్నట్టు వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తున్నాయి. ఈ న్యూస్‌పై అధికారిక ప్రకటన ఏం రాకున్నా అభిమానులు, మూవీ లవర్స్‌లో మాత్రం రీమేక్‌పై క్యూరియాసిటీ పెరిగిపోతుంది.
ఒకవేళ ఇదే నిజమైతే రాజ్ కుమార్ రావు ఎలాంటి పాత్రలో కనిపిస్తాడనేది ఆసక్తి నెలకొంది. కంటెంట్ పరంగా తెలుగు సినిమాలకు వరల్డ్‌వైడ్‌గా పాపులారిటీ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన పలు సినిమాలు ఇతర భాషల్లో కూడా రీమేక్ అయ్యాయి. బకాసుర రెస్టారెంట్ హిందీలో రీమేక్ అయితే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి.
Srinidhi Shetty | సిద్ధు పాత్రతో ప్రేమలో పడిపోతారు.. తెలుసు కదా సినిమాపై శ్రీనిధి శెట్టి
Kiran Abbavaram | కిరణ్ అబ్బవరం వెబ్‌సిరీస్ జోనర్ ఇదేనట..!
Deepika Padukone | పనిగంటల వివాదం.. తొలిసారి స్పందించిన దీపికా పదుకొణే