Hi Nanna | నాని (Nani)కెరీర్లో వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్ సినిమాగా నిలిచింది హాయ్ నాన్న (Hi Nanna). శౌర్యువ్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. 2023 డిసెంబర్ 7న విడుదలైన ఈ మూవీ పలు విభాగాల్లో అవార్డులు కూడా అందుకుంది. అయితే తాజాగా హాయ్ నాన్న కాపీ రైట్ చిక్కుల్లో పడింది.
అవనే శ్రీమన్నారాయణ, కిర్రిక్ పార్టీ లాంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన కన్నడ నిర్మాత పుష్కర మల్లిఖార్జునయ్య హాయ్ నాన్న మూవీపై కాపీ ఆరోపణలు చేశారు. హాయ్ నాన్న సినిమా తాను తెరకెక్కించిన 2020 కోవిడ్ టైంలో విడుదలైన కన్నడ చిత్రం భీమసేన నల మహారాజకు కాపీ అని ఆరోపించారు. హాయ్ నాన్న మేకర్స్ అధికారికంగా రీమేక్ రైట్స్‌కు సంబంధించి ఎలాంటి అనుమతి లేకుండా సినిమా తెలుగులో రీమేక్ చేశారని పేర్కొన్నారు.
మరి కన్నడ నిర్మాత ఆరోపణల నేపథ్యంలో నాని అండ్ శౌర్యువ్ టీం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కన్నడ చిత్రంలో హీరో తన లవ్ స్టోరీని చెప్పేందుకు హీరోయిన్ను రిసార్ట్‌కు పిలుస్తాడు. కథలో ఓ చిన్నారి కూడా ఉంటుంది. కొంచెం ఇదే తరహా లైన్ హాయ్ నాన్నలో కూడా కనిపించగా.. ఇందులో సన్నివేశాలను కొంచెం డిఫరెంట్ సెటప్‌లో చూపించినట్టు గమనించవచ్చు. అయితే ఈ వ్యవహారాన్ని కాపీగా ఆరోపించడంపై నెటిజన్లు, మూవీ లవర్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు.
Pushkara Mallikarjunaiah, the producer of #BheemasenaNalamaharaja (Kannada film), slams the makers of #HiNanna for remaking their film without purchasing the official remake rights. @NameisNani pic.twitter.com/18z7XQ2BLa
— Let’s X OTT GLOBAL (@LetsXOtt) January 30, 2025
Ram Gopal Varma | సిండికేట్‌పై వర్క్ చేస్తున్నా.. కానీ ఆ వార్తలు అబద్ధం.. పుకార్లపై రాంగోపాల్ వర్మ
Sai Pallavi | తండేల్కు సాయిపల్లవి టాప్ రెమ్యునరేషన్.. ఈ సారి నో కాంప్రమైజ్..!