90లలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్టార్ హీరోలతో నటించి వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ గా బాక్సాపీస్ ను షేక్ చేసింది అలనాటి అందాల తార రంభ (Rambha). రాజేంద్రప్రసాద్ నటించిన ఆ ఒక్కటి అడక్కు చిత్రంతో మొదటిసారి సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది. సినిమాలో రంభ హీరోయిన్ గా ఉందంటే థియేటర్లకు పరుగులు పెట్టాల్సిందే. ఈ ఎవర్ గ్రీన్ హీరోయిన్ పై ఇపుడు ఓ పాట రెడీ అయింది. ఆర్ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి (Ajay Bhupathi ) డైరెక్షన్ లో వస్తున్న చిత్రం మహాసముద్రం (Maha Samudram).
సిద్దార్థ్, శర్వానంద్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రంభపై స్పెషల్ గా ఓ పాటను పెట్టాడు డైరెక్టర్ అజయ్ భూపతి. ‘హే రంభ’ అంటూ సాగే తొలి పాటను రేపు మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సాంగ్ ఇంట్రడక్షన్ వీడియోను అజయ్ భూపతి ట్విటర్ లో షేర్ చేశా డు.ఆగస్టు 6న ఉదయం 10.08 గంటలకు లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేస్తున్నట్టు అజయ్ భూపతి ట్వీట్ చేశాడు. ఈ పాటను రంభకు డెడికేట్ చేస్తున్నట్టు వీడియో ద్వారా చెప్పాడు.
శర్వానంద్, సిద్దార్థ్ కలర్ ఫుల్ రంభ కటౌట్ ముందు నిలబడి ఉన్న పోస్టర్ ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. హే రంభ మాట క్లాస్, మాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకునేలా డిజైన్ చేసినట్టు తాజా రషెస్ చూస్తే తెలుస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా నిర్మితమవుతున్న ఈ మూవీలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Be Ready to Fill your Charts🎼with our First Single #HeyRambhaRambha 🕺💃From Aug 6th 10.08 AM💥
— Ajay Bhupathi (@DirAjayBhupathi) August 4, 2021
A Special Massy Tribute to Our Rambha ✨ From #MahaSamudram 🌊
A @chaitanmusic Musical🥁@ImSharwanand @IamJagguBhai @AnilSunkara1 @AKentsOfficial @Cinemainmygenes @SonyMusicSouth pic.twitter.com/HCrVs4vLtE
ఇవి కూడా చదవండి..
Meet Cute| జెట్ స్పీడ్లో నాని ‘మీట్ క్యూట్’ షూటింగ్
Friday New Movies | శుక్రవారం సందడి..ఆగస్ట్ 6న 7 సినిమాలు రిలీజ్
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?