Anupama Parameswaran | కర్లీ హెయిర్‌తో, చబ్బీ లుక్స్‌తో కోట్లాదిమంది అభిమానులు, ఫాలోవర్లను సంపాదించుకుంది కేరళ భామ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). గతేడాది కార్తికేయ 2తో బ్లాక్ బస్టర్ హిట్టు ఖాతాలో వేసుకుంది అనుపమ పరమేశ్వరన్. సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్గా మెరిసిన ఈ భామ తనలోని మరో యాంగిల్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు రెడీ అయింది. ఇంతకీ విషయమేంటనుకుంటున్నారా..? ఈ సారి సినిమాటోగ్రాఫర్‌గా మారింది అనుపమ పరమేశ్వరన్.
ఈ బ్యూటీ ఏ ప్రాజెక్ట్‌కు పనిచేసిందనే కదా మీ డౌటు. తెలుగు షార్ట్ ఫిలిమ్ I Miss Youకు డీవోపీగా పనిచేసింది. సంకల్ప్ గోరా డైరెక్ట్ చేసిన ఈ షార్ట్ ఫిలిం ప్రస్తుతం యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. సినిమాటోగ్రాఫర్‌గా అనుపమ వర్కింగ్ స్టైల్ ఎలా ఉందో.. షార్ట్ ఫిలిం చూసి చెప్పేయండి మరి. దుల్కర్ సల్మాన్ నిర్మించిన మొదటి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేసింది అనుపమ పరమేశ్వరన్.
అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ టైటిల్ రోల్ పోషిస్తున్న టిల్లు 2 (Tillu Square)లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు తమిళంలో Siren, మలయాళంలో JSK Truth Shall Always Prevail సినిమాల్లో నటిస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులు షూటింగ్ దశలో ఉన్నాయి.
Virupaksha Trailer | ఎవరికైనా చావుకెదురెల్లే దమ్ముందా..? సస్పెన్స్‌గా విరూపాక్ష ట్రైలర్
Shaakuntalam | సమంత శాకుంతలం సెన్సార్ అప్డేట్.. రన్‌టైం ఎంతో తెలుసా..?