Shaakuntalam | సమంత శాకుంతలం సెన్సార్ అప్డేట్.. రన్‌టైం ఎంతో తెలుసా..?
సమంత (Samantha) లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం శాకుంతలం (Shaakuntalam). విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో సెన్సార్ అప్డేట్ బయటకు వచ్చింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం శాకుంతలం (Shaakuntalam). పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గుణశేఖర్ (Guna Sekhar) దర్శకత్వం వహిస్తున్నాడు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో సెన్సార్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతోపాటు సినిమా నిడివి ఎంతో తెలిసిపోయింది. తాజా అప్డేట్ ప్రకారం శాకుంతలం రన్‌టైం 142 నిమిషాలు ( 2 గంటల 22 నిమిషాలు).
ఈ చిత్రంలో మలయాళ యాక్టర్ దేవ్ మోహన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా కథాంశంతో వస్తోన్న ఈ మూవీలో అనన్య నాగళ్ల, అదితీ మోహన్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. శాకుంతలం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన శాకుంతలం టీజర్, ట్రైలర్‌తోపాటు పాటలకు మంచి స్పందన వస్తోంది. సమంత ఈ చిత్రంలో పురు రాజవంశపు రాణి కావ్య నాయకి శకుంతల దేవి (Kavya Nayaki Shakuntala Devi) గా అలరించేందుకు రెడీ అవుతోంది. శాకుంతలం ఏప్రిల్ 14న థియేటర్లలో సందడి చేయనుంది.
శాకుంతలం ట్రైలర్..
రుషివనంలోన లిరికల్ వీడియో..
రుషివనంలోన తమిళ వెర్షన్
రుషివనంలోన హిందీ వెర్షన్
రుషివనంలోన మలయాళ వెర్షన్
రుషివనంలోన కన్నడ వెర్షన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

