జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కెమెరా ముందుకు రాక ఆరు నెలలు దాటింది.. ఆయన సినిమా విడుదలై ఎనిమిది నెలలు అయిపోయింది.. మరో రెండు నెలల వరకు షూటింగ్ మొదలుపెట్టే ఆలోచనలు కూడా లేవు. అయినా కూడా ఎన్టీఆర్ నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతూనే ఉన్నాడు.. అవ్వడం కాదు అలా చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. దానికి కారణం ఆస్కార్ అవార్డులే.
ఇండియా నుంచి అధికారికంగా ఆస్కార్ నామినేషన్‌కు ట్రిపుల్ ఆర్ (RRR) సినిమా వెళ్లలేకపోయింది. కానీ దాన్ని ఎలాగైనా ఆస్కార్ నామినేషన్స్ (Oscars) లో ఉంచాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు దర్శకుడు రాజమౌళి. ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు అంటూ దానికోసం బాగానే ట్రై చేస్తున్నాడు. అంతేకాదు సొంతంగా ఖర్చు కూడా పెడుతున్నట్టు తెలుస్తోంది.
ఆస్కార్ అవార్డుల కోసమే దాదాపు రెండు నెలలకు పైగా విదేశాల్లోనే ఉన్న రాజమౌళి.. అక్కడ హాలీవుడ్ ప్రముఖుల అందరికీ తన సినిమాను చూపించాడు. దీనికి ప్రతిఫలం కూడా దక్కుతూనే ఉంది. ఇప్పటికే న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ బెస్ట్ డైరెక్టర్ అందుకున్న రాజమౌళి.. తాజాగా గ్లోబల్ టాప్ 50 మూవీస్ ఆఫ్ 2022లో ప్రపంచంలోనే 9వ స్థానంలో నిలిచింది ట్రిపుల్ ఆర్.
ఇదిలా ఉంటే ఇందులో ఒక హీరోగా నటించిన జూనియర్ ఎన్టీఆర్ కు బెస్ట్ యాక్టర్ గా ఆస్కార్ అవార్డు రావడం ఖాయం అంటున్నారు నందమూరి అభిమానులు. ఏ కేటగిరీలో ఆస్కార్ కు త్రిబుల్ ఆర్ సినిమా నామినేట్ అయినా బెస్ట్ యాక్టర్ క్యాటగిరిలో మాత్రం.. జూనియర్ ఎన్టీఆర్ పేరు పక్కాగా ఉంటుందని వాళ్ళు బల్లగుద్ది చెప్తున్నారు. అందుకే #ManofMasses, #RRRforOscars, #NTRforOscars పేరుతో నేషనల్ వైడ్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. మరి వీళ్ల కోరిక నెరవేరుతుందా..? లేదా..? అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.
Read Also : Vinaro Bhagyamu Vishnu Katha | కూల్‌గా కిరణ్ అబ్బవరం వాసవ సుహాస సాంగ్ ప్రోమో
Read Also : Naatu Naatu Song | నాటు నాటు క్రేజ్‌కు ఆస్కార్ రావాల్సిందే.. వీడియో సాంగ్‌పై లుక్కేయండి
Read Also : Vijay Sethupathi | విజయ్ సేతుపతి అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. గెట్ రెడీ