Rashmika Mandanna | నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నటించిన చిత్రం థామా. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. థామా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది రష్మిక మందన్నా. ఈ భామ ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ది గర్ల్ఫ్రెండ్లో నటిస్తోంది. దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తోన్న ఈ మూవీ నవంబర్ 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీం.
కాగా ఓ ఇంటర్వ్యూలో సినీ ఇండస్ట్రీలో 8 గంటల పని దినంపై స్పందించింది రష్మిక మందన్నా. అతిగా పని చేయడం అంతగా సూచించదగిన విషయం కాదని.. స్థిరమైంది కూడా కాదని చెప్పింది. అంతేకాదు ప్రతీ ఒక్కరూ మొదట వారి ఆరోగ్యం, శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది.
తన టీం పట్ల ఉన్న బాధ్యతల నేపథ్యంలో తాను తరచూ అతిగా పనిచేయాల్సి వచ్చేదని.. అయితే యాక్టర్లు, సిబ్బంది ఇద్దరికీ ఆరోగ్యకరమైన పని, జీవన సమతుల్యతను కాపాడుకోవడానికి సినీ పరిశ్రమ 9 నుండి 6 గంటల షెడ్యూల్‌కు సమానమైన స్థిరమైన పని గంటలను ఫిక్స్ చేయాలని అభిప్రాయపడింది.
Nagadurg Debut | ధనుష్ మేనల్లుడి సినిమాలో హీరోయిన్గా తెలంగాణ ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ!
The Family Man S3 | ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ అనౌన్స్మెంట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!