Lakshya movie final collections | సాధారణంగా స్పోర్ట్స్ నేపథ్యం ఉన్న సినిమాలకు విజయావకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కథ తెలిసిందే అయినా కూడా.. కథనం పకడ్బందీగా ఉంటే కచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారని గతంలో ఎన్నో సినిమాలు నిరూపించాయి. నాని జెర్సీ సినిమా అవార్డులతో పాటు అనేక రివార్డులు కూడా సాధించడానికి.. అందులో ఉన్న స్క్రీన్ ప్లే, మ్యూజిక్ కారణం. ఈ ఏడాది చెక్ సినిమా చెస్ నేపథ్యంలో వచ్చింది. చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కించిన ఈ సినిమాలో నితిన్ హీరోగా నటించాడు. ఇది అసలు వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత కూడా కొన్ని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు. తాజాగా ఆర్చరీ నేపథ్యంలో నాగ శౌర్య హీరోగా లక్ష్య సినిమా వచ్చింది. మూడేళ్ల కిందట సుమంత్ హీరోగా వచ్చిన సుబ్రమణ్యపురం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ జాగర్లమూడి ఈ సినిమాకు దర్శకుడు. నిజానికి విలువిద్య నేపథ్యంలో తెలుగులో ఇప్పటివరకు సినిమాలు రాలేదు. అందుకే ఈ కాన్సెప్ట్ తీసుకున్నాడు దర్శకుడు. కథ విషయంలో కొత్తదనం లేక సినిమా డిజాస్టర్ అయిపోయింది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ వీక్ కలెక్షన్స్ వచ్చాయి.
నైజాం: 0.62 కోట్లు
సీడెడ్: 0.23 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.26 కోట్లు
ఈస్ట్: 0.12 కోట్లు
వెస్ట్: 0.09 కోట్లు
గుంటూరు: 0.14 కోట్లు
కృష్ణా: 0.17 కోట్లు
నెల్లూరు: 0.07 కోట్లు
ఏపీ-తెలంగాణ టోటల్: 1.70 కోట్లు
ఓవర్సీస్ + రెస్టాఫ్ ఇండియా + కర్ణాటక: 0.12 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ 15 డేస్ కలెక్షన్స్: 1.84 కోట్లు షేర్
ఈ సినిమాను 6.50 కోట్లకు అమ్మారు. కానీ ఫుల్ రన్ అయ్యే సరికి కనీసం 2 కోట్లు కూడా తీసుకురాలేక బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిపోయింది లక్ష్య. అనుకున్న లక్ష్యానికి చాలా దూరంలోనే ఆగిపోయింది. వరుడు కావలెను సినిమాతో పర్లేదు అనిపించిన నాగ శౌర్య.. ఈ సారి మాత్రం పూర్తిగా నిరాశ పరిచాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Vaasivaadi tassadiyya | బంగార్రాజు సాంగ్ టీజర్ అదిరింది..
ఫ్లాట్ కిరాయికి ఇచ్చిన సల్మాన్ ఖాన్.. అద్దె ఎంతంటే..?
Pushpa | పుష్ప విషయంలో అల్లు అర్జున్ ముందు నుంచి కోరుకున్నది ఇదే..
Allu Arjun: వివాదాలతో వార్తలలో నిలిచిన సమంత సాంగ్.. బన్నీ స్పందన ఏంటి?