Vaasivaadi tassadiyya Bangarraju song| అనుకున్న దానికంటే చాలా వేగంగా బంగార్రాజు షూటింగ్ పూర్తవుతుంది. కేవలం 50 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని ముందుగానే చెప్పాడు నాగార్జున. అనుకున్నట్లుగానే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల కూడా షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 15న విడుదల కానుంది. ట్రిపుల్ ఆర్, భీమ్లా నాయక్, రాధే శ్యామ్ లాంటి భారీ సినిమాలు వస్తున్నా కూడా తన దారి తనదే అంటున్నాడు నాగార్జున. 2016 లో వచ్చిన సోగ్గాడే చిన్నినాయన సినిమాకు ఇది ప్రీక్వెల్. బంగార్రాజు జీవితంలో ఏం జరిగింది అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు.
దీని కోసం నాగార్జున సీనియర్ రైటర్స్ అందరిని ఒక దగ్గరికి చేర్చాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి తాజాగా మరో పాట విడుదలైంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. తాజాగా పార్టీ సాంగ్ ఆఫ్ ద ఇయర్ అంటూ ఒక పాటను విడుదల చేసింది బంగార్రాజు టీం. దీనికి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. నువ్వు పెళ్లి చేసుకొని వెళ్లిపోతే బంగార్రాజు.. మాకు ఇంకెవడు కొనిపెడతడు కోక బ్లౌజు.. నువ్వు శ్రీ రాముడివి అయిపోతే బంగార్రాజు.. మాకు ఎవరు తీరుస్తారు ముద్దు మోజు అంటూ సాగే ఈ లిరిక్స్ పిచ్చెక్కిస్తున్నాయి.
ట్యూన్ కూడా బాగా ఉండటంతో పాట కచ్చితంగా సూపర్ హిట్ అయ్యేలా కనిపిస్తోంది. డిసెంబర్ 19న పూర్తి పాట విడుదల కానుంది. ఈ పాటలో జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా స్టెప్పులేయడం గమనార్హం. అటు నాగార్జున, ఇటు నాగచైతన్య ఇద్దరూ ఈ పాటలో కలిసి డాన్స్ చేశారు. దాంతో అక్కినేని అభిమానులు ఈ పాట కోసం వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. రమ్యకృష్ణ ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా కృతి శెట్టి నాగచైతన్యకు జోడిగా నటిస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Anoop rubens | సాంగ్స్ కాపీ కొట్టడంపై అనూప్ రూబెన్స్ అభిప్రాయమేంటి?
ఫ్లాట్ కిరాయికి ఇచ్చిన సల్మాన్ ఖాన్.. అద్దె ఎంతంటే..?
పుష్ప మొదటి రోజు కలెక్షన్స్ ఎంత ఉండొచ్చు..?
Allu Arjun: వివాదాలతో వార్తలలో నిలిచిన సమంత సాంగ్.. బన్నీ స్పందన ఏంటి?