Akhanda third week collections | నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా ఇప్పటికీ మంచి కలెక్షన్స్ సాధిస్తుంది. రెండో వారం తర్వాత కూడా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు వస్తున్నాయి. విడుదలైన 15వ రోజు కూడా 65 లక్షల షేర్ వసూలు చేసింది ఈ సినిమా. బాలయ్య బాక్సాఫీస్ దగ్గర చాలా రోజుల తర్వాత సత్తా చూపిస్తున్నాడు. రెండో వీకెండ్ దాదాపు 4 కోట్ల వరకు వసూలు చేసింది అఖండ. అలాగే రెండో వారం అయిపోయిన తర్వాత అదే జోరు కొనసాగిస్తుంది. ముఖ్యంగా వీక్ డేస్ మొదలైన తర్వాత కూడా సినిమాకు చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చాయి. రోజుకు కనీసం కోటికి అటూ ఇటూగా రన్ సాగుతుంది. డిసెంబర్ 17న పుష్ప విడుదల కావడంతో అఖండ కలెక్షన్స్‌పై భారీ ప్రభావం పడటం ఖాయం. ఇప్పటి వరకు అయితే 15 రోజుల్లో ఈ సినిమా ఎంత వసూలు చేసిందో చూద్దాం..
నైజాం: 18.23 కోట్లు
సీడెడ్: 13.77 కోట్లు
ఉత్తరాంధ్ర: 5.71 కోట్లు
ఈస్ట్: 3.72 కోట్లు
వెస్ట్: 3.12 కోట్లు
గుంటూరు: 4.30 కోట్లు
కృష్ణా: 3.28 కోట్లు
నెల్లూరు: 2.35 కోట్లు
ఏపీ-తెలంగాణ టోటల్: 54.48 కోట్లు
ఓవర్సీస్ + రెస్టాఫ్ ఇండియా + కర్ణాటక: 9.78 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ 15 డేస్ కలెక్షన్స్: 64.26 కోట్లు షేర్
అఖండ సినిమాకు 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 15 రోజుల్లోనే 64.26 కోట్లు షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. ఇప్పటికే లక్ష్యం కంటే 12 కోట్లకు పైగానే లాభాలు వచ్చాయి. అయితే ఆంధ్రలోని ఒకట్రెండు ఏరియాల్లో ఇంకా సేఫ్ జోన్ కు రాలేదు అఖండ. అక్కడ టికెట్ రేట్స్ తక్కువగా ఉండటంతో కొన్ని ఏరియాల్లో లక్షల్లో వెనకబడింది అఖండ. ఫుల్ రన్లో సినిమా ఏం చేస్తుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Bala Krishna: సినిమా ఇండస్ట్రీని కాపాడతాం అంటున్న బాలకృష్ణ
Pragya Jaiswal | ‘అఖండ’తో ఎప్పుడూ లేని అనుభూతి : ప్రగ్యాజైశ్వాల్
ఫ్లాట్ కిరాయికి ఇచ్చిన సల్మాన్ ఖాన్.. అద్దె ఎంతంటే..?
Allu Arjun: వివాదాలతో వార్తలలో నిలిచిన సమంత సాంగ్.. బన్నీ స్పందన ఏంటి?