Akhanda first week collections | బాలకృష్ణ సినిమాకు కలెక్షన్లు ఓ రేంజ్లో ప్రభంజనం సృష్టిస్తోంది. ఎవరూ కలలో కూడా ఊహించలేదు. కానీ అనుకోనిది జరిగింది. అఖండ ఆగమనంతో బాక్సాఫీస్ కు పట్టిన తుప్పు వదిలి పోయింది. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా కేవలం వారం రోజుల్లోనే రూ.88 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. బోయపాటి శీను తెరకెక్కించిన ఈ సినిమా మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్గా వచ్చింది. మాస్ ఎలిమెంట్స్ బాగా ఉండటంతో ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. మొదటి రోజు నుంచి కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న అఖండ.. ఏడో రోజు కూడా అదే ఊపు కొనసాగించింది. విడుదలైన ఏడో రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.60 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ సినిమా. ప్రపంచవ్యాప్తంగా 2 కోట్లు వసూలు చేసింది.
నైజాం: 14.87 కోట్లు
సీడెడ్: 11.72 కోట్లు
ఉత్తరాంధ్ర: 4.56 కోట్లు
ఈస్ట్: 3.08 కోట్లు
వెస్ట్: 2.43 కోట్లు
గుంటూరు: 3.73 కోట్లు
కృష్ణా: 2.73 కోట్లు
నెల్లూరు: 1.98 కోట్లు
ఏపీ-తెలంగాణ టోటల్: 45.11 కోట్లు (71.70 కోట్లు గ్రాస్)
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: 3.82 కోట్లు
ఓవర్సీస్: 4.56 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ 7 డేస్ కలెక్షన్స్: 53.59 కోట్లు (87.85 కోట్లు గ్రాస్)
అఖండ సినిమాకు 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 7 రోజుల్లోనే రూ.53.59 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. మరో 50 లక్షల షేర్ వసూలు చేస్తే సినిమా సేఫ్ జోన్కు వస్తుంది. బుధవారం కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. దాంతో సినిమా నిలబడిపోయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అఖండ సినిమా ఇంటర్వ్యూలో బాలయ్యబాబు పంచులే పంచులు..!!
Akhanda: అఖండ సినిమాని ఇంత త్వరగా ఓటీటీలోకి తీసుకురాబోతున్నారా..!
Akhanda: అఖండ సీక్వెల్కి సన్నాహాలు.. ఇందులో ఏం చూపించనున్నారో తెలుసా?
విలన్గా నటించేందుకు ఓకే చెప్పిన బాలయ్య.. కాకపోతే అదొక్కటే కండీషన్