దేవరకొండ రూరల్, అక్టోబర్ 06 : దేవరకొండ మండలం గొట్టిముక్కల గ్రామానికి చెందిన పిరాటి ఆంజనేయులు మృతి బాధాకరమని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం గొట్టిముక్కల గ్రామంలో ఆంజనేయులు మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, మాజీ సర్పంచ్ అయ్యన్న, ఎరుకలి యాదయ్య, చందు నాయక్, పర్వతాలు, పున్నమూర్తి లింగం, బాధ్య నాయక్ పాల్గొన్నారు.