Imanvi | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఆతిథ్యం ఎలా ఉంటుందో అభిమానులు, మూవీ లవర్స్‌కు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ప్రభాస్ ఇంటి భోజనం ఎంత ప్రత్యేకమో పలు సందర్భాల్లో షేర్ చేసుకున్నారు. ప్రభాస్ ఆతిథ్యాన్ని స్వీకరించిన వారిలో తాజాగా అతడి కోస్టార్ ఇమాన్వీ కూడా చేరిపోయింది. ప్రభాస్, ఇమాన్వీ కాంబినేషన్లో ఫౌజీ (Fauzi) సినిమా వస్తోన్న విషయం తెలిసిందే.
ఫౌజీ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో కొనసాగుతోంది. షూటింగ్ బ్రేక్ టైంలో ఇమాన్వీ ప్రభాస్ ఇంట్లో పసందైన భోజనాన్ని రుచి చూసింది. సర్ప్రైజింగ్గా, సంతోషంగా అనిపించింది.. మీ ఆతిథ్యానికి నా మనస్సు, పొట్ట నిండుగా మారిపోయాయి. ప్రభాస్ గారు మీ ఆతిథ్యానికి ధన్యవాదాలు.. అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ఇమాన్వీ. ఇప్పుడీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్ట్ చేస్తున్న ఫౌజీ చిత్రంలో శాండల్ వుడ్ భామ, సింగర్ ఛైత్ర జే అచర్ కీలక పాత్రలో నటిస్తోంది. పీరియాడిక్ యాక్షన్ రొమాంటిక్ డ్రామా వస్తోన్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. మేకర్స్ ఈ చిత్రాన్ని 2026 ఆగస్టులో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. మారుతి డైరెక్షన్లో రాజాసాబ్ చేస్తున్నాడు. దీంతోపాటు సలార్ 2, కల్కి 2, స్పిరిట్ చిత్రాలు ట్రాక్‌పై ఉన్నాయి.

Sigma | విజయ్ తనయుడు డెబ్యూ మూవీ.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్
Govinda | గోవిందా భార్య సంచలన వ్యాఖ్యలు .. ఇంకో జన్మ ఉంటే గోవిందా నా భర్తగా వద్దు ..
Suma | పాడ్‌కాస్ట్‌లో విడాకులపై క్లారిటీ ఇచ్చిన సుమ.. కలిసి కనిపించిన విడిపోలేదా అనే వారు