Ranya Rao | గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యారావు అరెస్టయి.. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారించింది. కేసు విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసిన న్యాయస్థానం.. అప్పటిలోగా అభ్యంతరాలు దాఖలు చేయాలని డీఆర్ఐ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. ఈ నెల 14న ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు.. రన్యారావుపై ఉన్న అభియోగాలు తీవ్రమైనవి పేర్కొంటూ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. న్యాయమూర్తి విశ్వనాథ్ సీ గౌడర్ నేతృత్వంలోని కోర్టు, నటిని జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అంగీకరించింది. దాంతో ఆమె బెయిల్ కోసం సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. మార్చిన బెంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.12.56కోట్ల విలువైన 14.2 బంగారాన్ని రన్యారావు నుంచి డీఆర్ఐ స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత నటిని అరెస్టు చేశారు. ఆమె దుబాయి నుంచి భారత్‌కు చేరుకోగా.. హై ప్రొఫైల్ గోల్డ్ స్మగ్లింగ్‌లో భాగమయ్యారని ఆరోపించింది. కస్టడీ సమయంలో నటి అభియోగాలను అంగీకరించింది.
తనకు గుర్తు తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చిందని.. బంగారాన్ని స్మగ్లింగ్ చేయమని ఎలా అడిగారో ఆమె అధికారులకు వివరించింది. యూట్యూబ్ వీడియోల సహాయంతో తాను స్మగ్లింగ్ ట్రిక్స్ నేర్చుకున్నానని విచారణలో వెల్లడించింది. ఈ నెల 15న డీఆర్ఐ అధికారులు తనను కస్టడీలో హింసించారని రన్యారావు ఆరోపించింది. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి దాఖలు చేసిన పిటిషన్లో తనపై శారీకంగా దాడి చేశారని.. అనేకసార్లు కొట్టారని.. నిద్రపోయేందుకు, భోజనం చేసేందుకు కూడా అనుమతించలేదని ఆరోపించింది. ఖాళీ పేపర్లపై సంతకాలు చేయాలని ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. అధికారులు చెప్పినట్లుగా చేయకపోతే తన తండ్రి గుర్తింపు బయటకు వెల్లడిస్తామని డీఆర్ఐ అధికారులు బెదిరించినట్లుగా పిటిషన్లో ఆరోపించింది. రన్యారావు సవతి తండ్రి కర్ణాటకకు చెందిన కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. రన్యారావు అరెస్ట్ నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) డాక్టర్ కే రామచంద్రరావును కర్నాటక ప్రభుత్వం సెలవుపై పంపింది. ఆయనపాత్రపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.