సోమవారం 08 మార్చి 2021
Cinema - Jan 19, 2021 , 10:02:41

క‌మ‌ల్ ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చిన శృతి, అక్ష‌ర‌

క‌మ‌ల్ ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చిన శృతి, అక్ష‌ర‌

లోకనాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ గ‌త కొద్ది రోజులుగా బిగ్ బాస్ షోతో పాటు సినిమాలు, రాజ‌కీయాల‌తో బిజీ బిజీగా ఉన్నారు. అయితే శభాష్ నాయుడు షూటింగ్  స‌మ‌యంలో  కమల్ హాసన్ యాక్సిడెంట్‌కు గురి కావ‌డంతో ఆయ‌న కాలుకు శస్త్ర చికిత్స జరిగింది. డాక్టర్లు రెస్ట్ తీసుకోమని చెప్పినా.. కమల్ హాసన్ అవేమి ప‌ట్టించుకోకుండా త‌న‌ప‌నులు చేసుకుంటూ వెళ్లారు. ఇప్పుడు ఆ గాయం తిరగ‌పెట్గ‌డంతో సినిమాలు, రాజ‌కీయాల‌కు కొద్ది రోజులు బ్రేక్ ఇచ్చి శ‌స్త్ర చికిత్స చేయించుకున్నారు.

అంద‌రి ప్రేమ‌, అభిమానం , ఆశీర్వాదం వ‌ల‌న త‌మ తండ్రి శ‌స్త్ర చికిత్స విజ‌య‌వంతంగా ముగిసింద‌ని, మ‌రో నాలుగైదు రోజుల‌లో తిరిగి ఇంటికి వ‌స్తార‌ని శృతి హాస‌న్, అక్ష‌ర ఓ స్టేట్‌మెంట్ రిలీజ్ చేశారు. నాన్న‌గారి ఆరోగ్యం విష‌యంలో శ్రీ రామ చంద్ర ఆసుప‌త్రి చాలా కేర్ తీసుకున్నార‌ని, వారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాం అంటూ శృతి, అక్ష‌ర పేర్కొన్నారు. అతి త్వ‌ర‌లోనే నాన్న‌గారు  మిమ్మ‌ల్ని క‌లుస్తారు. మీరు చూపించే ప్రేమ‌, అందించే ధైర్యం వ‌ల‌న నాన్న త్వ‌ర‌గా కోలుకుంటున్నారు అని లేఖ‌లో తెలియ‌జేశారు. కాగా, ఈ యేడాది ఏప్రిల్‌లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 234 సీట్లలో పోటీ చేసేందుకు  క‌మ‌ల్ పార్టీకు  కామన్ గుర్తు టార్చ్ లైట్ కేటాయించారు. అన్ని సెగ్మెంట్లలోనూ ఒకే గుర్తు మీద పోటీ చేసే అవ‌కాశం ఉంది. 

VIDEOS

logo