Ram Pothineni – Harish Shankar | రామ్ పోతినేని ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న డబుల్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ పతాకంపై చార్మి కౌర్‌తో కలిసి పూరీ జగన్నాథ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్-పూరీ కలయికలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్ ఇది. పూర్తి మాస్ మసాలా ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా వుండగా.. ఇదే తేదిన మరో మాస్ ద్వయం రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ రాబోతుందని ప్రకటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఇదే తేదిన విడుదల కావడంపై హరీష్ శంకర్, రవితేజపై రామ్ క్యాంప్, ఇటు పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్‌లు అసంతృప్తిగా వున్నట్లు తెలిసింది. అంతేకాదు మేము ఎప్పుడో బుక్‌చేసుకున్న స్లాట్న్ సడెన్‌గా తమ సినిమా డేట్‌ను ప్రకటించడంపై పూరీ క్యాంప్ మిస్టర్బచ్చన్ టీమ్‌పై ఫైర్ అవుతున్నారట. అంతేకాదు పూరీ టీమ్ అందరూ హరీష్ శంకర్‌ను తమ సోషల్ మీడియాలో అన్ ఫాలో చేశారట.
అయితే దీనిపై మేము కావాలని ఆ డేట్‌కు రాలేదని అలా కుదిరిందని అంటున్నారు హరీశ్ శంకర్. పూరీ సార్‌తో నేను కంపేర్ చేసుకోవడం లేదని, ఆయనపై నాకు ఎప్పుడూ గౌరవం వుందని అన్నారు హరీశ్ శంకర్. అంతేకాదు నా తదుపరి సినిమా హీరో రామ్ పోతినేనితోనే వుందని ఆ సినిమాను కృష్ణమ్మ నిర్మాత కృష్ఱ నిర్మిస్తారని తెలిపారు హరీశ్ శంకర్. సో.. రామ్‌తో సినిమా పెట్టుకుని రామ్ సినిమాపై నేను సినిమా ఎలా రిలీజ్ చేస్తానని.. ఇదంతా నిర్మాతల నిర్ణయని, వాళ్ల బిజినెస్ క్యాలిక్లేషన్స్కు మేము ఎలా అడ్డు వస్తామని తెలిపారు హరీష్‌శంకర్. సో.. రామ్ తన తదుపరి చిత్రం హరీశ్ శంకర్‌తో ఫిక్స్ చేసుకున్నట్లే…!
Also read..