టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా (Tejasajja) నటిస్తోన్న తాజా చిత్రం హనుమాన్ (HanuMan). ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చే డైరెక్టర్ ప్రశాంత్‌వర్మ (Prasanth Varma) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తొలి తెలుగు సూపర్ హీరో సిరీస్‌గా వస్తున్న హనుమాన్ టీజర్ ఇప్పటికే నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. కాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ త్వరలోనే రానుంది. హనుమాన్ చిత్రం మే 12న విడుదల కానుందని తెలియజేస్తూ.. స్పెషల్ టీ షర్ట్ ద్వారా పరోక్షంగా తెలియజేశాడు ప్రశాంత్ వర్మ. నాగచైతన్య నటించిన కస్టడీ చిత్రం కూడా మే 12నే మధ్య థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద రెండు సినిమాల ఎలాంటి ఫైట్ ఉండబోతుందన్నది తెలియాల్సి ఉంది.
యూనివర్సల్ కథాంశంతో అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న హనుమాన్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతుందోనని టీజర్ చూసిన మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. కోలీవుడ్ భామ అమృతా అయ్యర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి గౌరా హరి-అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు.
శ్రీమతి చైతన్య సమర్పణలో వస్తున్న హనుమాన్ చిత్రానికి అస్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, వెంకట్ కుమార్ జెట్టీ లైన్ ప్రొడ్యూసర్‌గా, కుశాల్ రెడ్డి అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. హనుమాన్ విడుదల తేదీపై మేకర్స్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు. జాంబిరెడ్డి తర్వాత తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబోలో వస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Hanu-Man first single is coming! 💪🏼🤞🏼 pic.twitter.com/sweUMjtDYM
— Prasanth Varma (@PrasanthVarma) March 5, 2023
Nagarjuna | క్రేజీ టాక్.. నాగార్జున టీంతో గోల్డెన్ గ్లోబ్ అవార్డు విన్నర్..!
Kushi | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఖుషి కొత్త షెడ్యూల్ అఫీషియల్ అప్డేట్
Oo Antava Mava | ఉ అంటావా మావా మేనియా రిపీట్.. డీజే మార్టిన్‌తో అల్లు అర్జున్ డ్యాన్స్
Ahimsa | అభిరామ్-తేజ టీం క్రేజీ అప్డేట్.. అహింస రిలీజ్ టైం ఫిక్స్