Hanu Man | టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా (Tejasajja) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం హనుమాన్ (HanuMan). ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జా తొలి పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. తొలి తెలుగు సూపర్ హీరో సిరీస్‌గా రిలీజైన హనుమాన్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడిక ఈ చిత్రానికి కొనసాగింపుగా జై హనుమాన్ కూడా ట్రాక్‌పై ఉన్నదని తెలిసిందే.
చాలా కాలానికి హనుమాన్ మరోసారి వార్తల్లో నిలిచింది. హనుమాన్ ఇక ఖండాంతరాల్లో కూడా తన సత్తా చాటేందుకు రెడీ అయింది. ఈ చిత్రం జపనీస్ భాషలో కూడా సందడి చేయనుంది. అక్టోబర్ 4న జపాన్‌లో గ్రాండ్‌గా విడుదల కానున్నట్టు తెలియజేశాడు ప్రశాంత్ వర్మ. జపాన్‌లోని పలు థియేటర్లలో సినిమా తెలుగు వెర్షన్ జపనీస్ సబ్ టైటిల్స్‌తో స్క్రీనింగ్ కానున్నట్టు తెలిపాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ స్పెషల్ ట్రైలర్ కూడా విడుదల చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది.
హనుమాన్ తెలుగు రాష్ట్రాల్లో 25 సెంటర్లలో 100 బ్లాక్ బస్టర్ డేస్‌ను కూడా పూర్తి చేసుకుంది. హనుమాన్ ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ జీ 5 (తెలుగు) లో, జియో సినిమా (హిందీ)లలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ అమృతా అయ్యర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి గౌరా హరి-అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సంయుక్తంగా మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీని శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి తెరకెక్కించారు.
After creating a sensation all over❤️🔥#HanuMan is now all set to amaze the audience in Japan 💥
The Japanese subtitled version is all set to hit the screens on October 4th 🤩#HanuManInJapan 🔥
🌟ing @tejasajja123@Actor_Amritha @Niran_Reddy @varusarath5 @VinayRai1809… https://t.co/ccprtfKEs3
— Prasanth Varma (@PrasanthVarma) July 27, 2024
Kubera | బర్త్ డే స్పెషల్.. ధనుష్ కుబేర నయా లుక్ వైరల్
Raayan Review | ధనుష్ రాయన్గా మెప్పించాడా.. పర్ఫెక్ట్ బెంచ్‌మార్క్ సినిమానా.. ?
Raayan | ధనుష్ రాయన్ స్ట్రీమింగ్ అయ్యే ఓటీటీ ప్లాట్‌ఫాం ఇదే..!