MagicMovements | టాలీవుడ్ యువ నటుడు తల్లాడ సాయికృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “మ్యాజిక్ మూవ్ మెంట్స్” (మీరు అనుకున్నది కాదు). ఈ చిత్రానికి ప్రముఖ దర్శకులు కె. దశరథ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, శ్రీ లక్ష్మి శ్రీనివాస ఫిలిమ్స్ బ్యానర్లపై ఈ సినిమాను తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. వెంకట్ దుగ్గిరెడ్డి సహ నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ సినిమా టైటిల్ లాంఛ్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు, చిత్ర బృందం పాల్గొన్నారు.
డీవోపీ సతీష్ రెడ్డి మాసం మాట్లాడుతూ – “తల్లాడ సాయికృష్ణకు ఎప్పుడూ సినిమా ఆలోచనే. ఏదో ఒకటి స్క్రిప్ట్ చేస్తుంటాడు, దాన్ని పిక్చరైజ్ చేస్తుంటాడు. నాకు కొన్నేళ్లుగా సాయికృష్ణ తెలుసు. అతని తపన చూసి మన వంతు సపోర్ట్ ఇవ్వాలని ఈ సినిమాకు నాకు వీలైనంత సహకారం అందించాను. “మ్యాజిక్ మూవ్ మెంట్స్” (మీరు అనుకున్నది కాదు) సినిమాతో సాయికృష్ణకు మంచి పేరు రావాలని ఆశిస్తున్నా.” అన్నారు.
డాక్టర్ ఏఎంఆర్ మాట్లాడుతూ – “ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా హీరోగా నిలదొక్కుకునేందుకు సాయికృష్ణ ప్రయత్నిస్తున్నాడు. అతని ప్రయత్నాలు “మ్యాజిక్ మూవ్ మెంట్స్” (మీరు అనుకున్నది కాదు) సినిమాతో సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. ఈ సినిమాకు సంబంధించిన కంటెంట్ చాలా బాగుంది. మీరంతా ఈ మూవీకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా.” అన్నారు.
సహ నిర్మాత వెంకట్ దుగ్గిరెడ్డి మాట్లాడుతూ – “నేను యూఎస్ లో ఉంటాను. నాకు సినిమాలంటే ఆసక్తి. సాయికృష్ణ ఇండస్ట్రీలో పడే కష్టం నాకు తెలుసు. అందుకే అతనికి సపోర్ట్ గా ఉండేందుకు ముందుకొచ్చాను. నేనూ ఈ చిత్రంలో ఒక మంచి రోల్ చేశాను. “మ్యాజిక్ మూవ్ మెంట్స్” (మీరు అనుకున్నది కాదు) సినిమా హిట్ అయి సాయికృష్ణ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవడంతో పాటు జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలని కోరుకుంటున్నా.” అన్నారు.
నిర్మాత తల్లాడ వెంకన్న మాట్లాడుతూ – “నన్ను నటుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేసింది సాయికృష్ణ. నేను హీరోగా ఒక్కడే అనే మూవీని చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో థియేటర్స్ రిలీజ్ చేశాను. ఇప్పుడు “మ్యాజిక్ మూవ్ మెంట్స్” (మీరు అనుకున్నది కాదు) సినిమాను మంచి కమర్షియల్ అంశాలతో నిర్మిస్తున్నాం. ఈ సినిమాలో థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో నేనొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించాను. తల్లాడ సాయితో ఈ సినిమా తర్వాత మరో పెద్ద సినిమా కూడా నిర్మించబోతున్నా” అన్నారు.
హీరోయిన్ ఏకాదంతాయ సిరి మాట్లాడుతూ – “చిన్న సినిమాలోకి హీరోయిన్స్ ను తీసుకున్నారంటే ఏదో గ్లామర్ షో చేయిస్తారు అనుకుంటారు. కానీ సాయికృష్ణ దర్శకుడిగా ఒక సిన్సియారిటీ చూపించారు. సినిమాను ఎంత ఫాస్ట్ గా రూపొందించారంటే మేమంతా ఆశ్చర్యపోయాం. ఇంత స్పీడ్ గా సినిమా చేయొచ్చా అనుకున్నాం. “మ్యాజిక్ మూవ్ మెంట్స్” (మీరు అనుకున్నది కాదు) మూవీ మీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుందని నమ్ముతున్నాం” అన్నారు.
నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ – “తల్లాడ సాయికృష్ణకు “మ్యాజిక్ మూవ్ మెంట్స్” (మీరు అనుకున్నది కాదు) సినిమాతో సక్సెస్ రావాలి. అతను మరో నాలుగు మూవీస్ చేసి ఇండస్ట్రీలో స్థిరపడాలని ఒక నిర్మాతగా కోరుకుంటున్నా.” అన్నారు.
హీరో, దర్శకుడు తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ – “సాయిబాబా ఆశీస్సులు ఇస్తున్న ఫొటో ఒకటి మా ఇంట్లో ఫ్రిడ్జ్ మీద ఉంది. ఆ ఫొటో చూసిన ఇన్సిపిరేషన్ తో “మ్యాజిక్ మూవ్ మెంట్స్” (మీరు అనుకున్నది కాదు) సినిమా స్క్రిప్ట్ మొదలైంది. ఈ సినిమా ప్రారంభించేప్పటికి మా దగ్గర డబ్బులు లేవు. కానీ సినిమా చేయాలి, చేస్తామనే నమ్మకం పట్టుదల ఉన్నాయి. ఆ టైమ్ లో మా వెంకట్ దుగ్గిరెడ్డి అన్న, తల్లాడ శ్రీనివాస్ గారు ముందుకొచ్చారు. వీరిద్దరితో పాటు నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేసే దశరథ్ గారు సమర్పకులుగా ఉండేందుకు అంగీకరించారు. ఈ సినిమా పోస్టర్ మీద ఒక సాయిబాబా ఉంటే మరో సాయిబాబాలా నాకు తన బ్లెస్సింగ్స్ ఇచ్చారు దశరథ్ గారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో తమ సహకారం అందించారు. “మ్యాజిక్ మూవ్ మెంట్స్” (మీరు అనుకున్నది కాదు) చిత్రాన్ని హీరోగా నటిస్తూ రూపొందిస్తున్నా. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో పాటు డివోషనల్ టచ్ కూడా మూవీలో ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. త్వరలోనే మిగతా పార్ట్ పూర్తి చేసి మూవీని విడుదలకు తీసుకొస్తాం.” అని తెలిపారు.
చిత్ర సమర్పకులు దశరథ్ మాట్లాడుతూ – “తల్లాడ సాయికృష్ణతో నాకు మంచి పరిచయం ఉంది. ఆయనకు సినిమా అంటే ప్యాషన్. ఎప్పుడూ సినిమా ప్రయత్నాల్లోనే ఉంటాడు. ఒకరోజు సాయి ఈ కథ నాకు వినిపించాడు. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది. సాయికృష్ణకు “మ్యాజిక్ మూవ్ మెంట్స్” (మీరు అనుకున్నది కాదు) సినిమాతో మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. సినిమా అంటే ఇష్టం ఉన్న సాయికృష్ణకు నా వంతు సపోర్ట్ అందించాలనే చిత్ర సమర్పణకు ముందుకొచ్చాను. ఈ మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా.” అన్నారు.
🎬 నటీనటులు & సాంకేతిక నిపుణులు
నటీనటులు: తల్లాడ సాయి కృష్ణ, ఏకదంతాయ సిరి, శ్రీలక్ష్మి, పృథ్వీరాజ్, కిషోర్ దాస్, అకెళ్ళ, వాసు ఇంటూరి, జబర్దస్త్ జీవన్, జబర్దస్త్ అప్పారావు, గడ్డం నవీన్, వెంకట్ దుగ్గిరెడ్డి, వినోద్ నువ్వుల, అమ్మినేని స్వప్న, తల్లాడ వెంకన్న, చంద్ర సుబ్బగారి, అను, భాను, మురళీ, సునీల్, చంద్ర, తారక్ దూగాన, పృథ్వీ, నిక్కీ చౌదరి, SVVP, రాంకీ, GSK సాయి, ఇంద్ర కుమార్, దత్తు, ప్రశాంత్, రవిరెడ్డి, బంగ్లా వెంకట్, ప్రసాద్, కొత్త వెంకటేశ్వర్లు, గౌరీ, వినోద్ ఫిల్మ్ అకాడమీ విద్యార్థులు.
టెక్నికల్ టీమ్:
బ్యానర్స్: శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫిలిమ్స్
సమర్పణ: కె. దశరధ్
నిర్మాత: తల్లాడ శ్రీనివాస్
సహ నిర్మాత: వెంకట్ దుగ్గిరెడ్డి
దర్శకత్వం: తల్లాడ సాయికృష్ణ
రైటర్: వద్దేటి వైజీ
డిఓపి: శివ రాథోడ్
మ్యూజిక్: లలిత్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రవణ్ కుమార్ వందనపు
పీఆర్ఓ: సతీష్ కొట్టంగి