Parasakthi | శివకార్తికేయన్ (Sivakarthikeyan) నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ (25వ చిత్రం) ‘పరాశక్తి’ (Parasakthi). ఆకాశం నీ హద్దురా ఫేం డైరెక్టర్ సుధా కొంగర (Sudha Kongara) డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. పొలిటికల్ హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న పరాశక్తిలో రానా కీలక పాత్రలో నటిస్తుండగా.. అథర్వ, రవి మోహన్, బాసిల్ జోసెఫ్ ఇతర నటీనటులు కీ రోల్స్‌లో నటిస్తున్నారు.
ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ మూవీ 2026 పొంగళ్ కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఈ చిత్రానిక ఇజీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. పరాశక్తి మూవీ అనుకున్న షెడ్యూల్ కంటే ముందే థియేటర్లలోకి వచ్చే అవకాశమున్నట్టు ఓ వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. తాజా టాక్ ప్రకారం కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ జననాయగన్తో పరాశక్తికి బాక్సాఫీస్ వద్ద పోటీ ఉండబోతుందట.
దీనిక్కారణం తెలుగులో 2-3 పెద్ద సినిమాలు విడుదల కావడమేనని ఇన్సైడ్ టాక్. రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న రాజాసాబ్ కూడా ఉండటం వల్ల తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్లో థియేటర్ల సంఖ్య తక్కువగా దొరికే అవకాశం ఉంటుందని భావిస్తున్న మేకర్స్ పరాశక్తి సినిమాను జనవరి 9న కానీ 10న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మరి ఇలాంటి పరిస్థితుల్లో శివకార్తికేయన్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలు వస్తాయనేది సస్పెన్స్‌గా మారింది.
Actor Pragathi | నా పూజల వలనే మెడల్స్ గెలిచింది.. నటి ప్రగతి పతకాలపై వేణు స్వామి కామెంట్స్
Akhanda 2 | బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ‘అఖండ 2’.. బాలయ్య మాస్ తుపానుకి తొలి రోజు ఫుల్ కలెక్షన్స్
Lionel Messi | ఒకచోట ఇద్దరు దిగ్గజాలు.. మెస్సీని కలిసిన షారుఖ్ ఖాన్.. వీడియో