Dhandoraa Title song | సామాజిక అంశాలను ప్రధానంగా తీసుకుని లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న వైవిధ్యమైన చిత్రం ‘దండోరా…’ ఈ మూవీ టైటిల్ సాంగ్‌ను మేకర్స్ శనివారం విడుదల చేశారు. సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజల వేదన, సామాజిక అసమానతలను ప్రశ్నిస్తూ సాగిన ఈ పాట చాలా ఎమోషనల్‌గా, హార్ట్ టచింగ్‌గా ఉంది. మార్క్ కె రాబిన్ సంగీత సారథ్యం వహించిన ఈ పాటను ప్రముఖ గీత రచయిత కాసర్ల శ్యామ్ రాయగా, ఆంథోని దాసన్, మార్క్ కె.రాబిన్ కలిసి ఆలపించారు. తరాలు మారుతున్నా, చంద్రుడిపైకి మనిషి అడుగుపెట్టినా.. ఈ అసమానతలు మాత్రం తగ్గడం లేదనే బలమైన భావాన్ని ఈ పాట ఆవిష్కరించింది.
“నిను మోసినా నను మోసినా, అమ్మ పేగు ఒకటేనన్నా. నిను కోసినా నను కోసినా, రాలే రగతం ఎరుపేనన్నా. చిన్నా పెద్దా తేడా ఎట్లొచ్చేరా, నన్ను తొక్కే హక్కు ఎవడిచ్చేరా.. ముట్టుకుంటే మైల ఎట్టయ్యెరా, కొట్టి కొట్టి గుండె డప్పయ్యెరా.. దండోరా.. దండోరా…” అంటూ ఎమోషనల్‌గా సాగింది ఈ పాట.
‘కలర్ ఫొటో’, బ్లాక్‌బస్టర్ ‘బెదురులంక 2012’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సామాజిక స్పృహను కలిగించే అంశంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.
అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతుందనే అంశాన్ని ఆధారంగా చేసుకుని ‘దండోరా’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను చూపుతూనే వ్యంగ్యం, హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికగా ఈ సినిమాను దర్శకుడు రూపొందించారు. టీజర్‌తోనే సినిమాలోని బలమైన అంశం ప్రేక్షకులకు అర్థమైంది. డిఫరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీ కారణంగా సినిమాపై భారీ బజ్ క్రియేట్ అవ్వడంతో, రిలీజ్ కంటే ముందే ‘దండోరా’ బిజినెస్ పూర్తవడం విశేషం.
నైజాం: మైత్రీ మూవీస్
ఆంధ్ర, సీడెడ్, కర్ణాటక: ప్రైమ్ షో
ఓవర్సీస్: అథర్వణ భద్రకాళి పిక్చర్స్ (200కు పైగా థియేటర్స్‌లో గ్రాండ్ రిలీజ్)
ఆడియో రైట్స్: T-సిరీస్
ఈ సినిమా డిసెంబర్ 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓవర్సీస్లో మాత్రం డిసెంబర్ 23నే ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు.
దండోరా.. చిత్ర బృందం
నటీనటులు: శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్: లౌక్య ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పనేని
దర్శకత్వం: మురళీకాంత్
సంగీతం: మార్క్ కె.రాబిన్
సినిమాటోగ్రఫీ: వెంకట్ ఆర్.శాఖమూరి
ఎడిటర్: సృజన అడుసుమిల్లి
ఆర్ట్ డైరెక్టర్: క్రాంతి ప్రియం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎడ్వర్డ్ స్టెవెన్సన్ పెరెజి
కాస్ట్యూమ్ డిజైనర్: రేఖా బొగ్గారపు
లైన్ ప్రొడ్యూసర్: కొండారు వెంకటేష్
ఆడియో: T-సిరీస్
ఓవర్సీస్ రిలీజ్: అథర్వణ భద్రకాళి పిక్చర్స్
పి.ఆర్.ఒ: ఎస్ కె నాయుడు – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)
మార్కెటింగ్: టికెట్ ఫ్యాక్టరీ