Gopichand | గతేడాది బీమా, విశ్వం సినిమాలతో ప్రేక్షకులకు హాయ్ చెప్పాడు గోపీచంద్ (Gopichand). ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద గోపీచంద్ అభిమానులు, మూవీ లవర్స్‌ను నిరాశ పరిచాయి. ప్రస్తుతం గోపీచంద్ ఘాజీ ఫేం సంకల్ప్‌రెడ్డి డైరెక్షన్లో చేస్తున్న సినిమాపై ఫోకస్ పెట్టాడు. ఈ మూవీ ప్రొడక్షన్ దశలో ఉంది. కాగా ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లే కంటే ముందే గోపీచంద్ మరో సినిమాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడంటూ ఓ వార్త ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఇంతకీ ఈ సారి గోపీచంద్ సినిమా చేయబోతుందెవరితోనో తెలుసా..? పాపులర్ ఫైట్ మాస్టర్ వెంకట్‌తో ఈ సినిమా ఉండబోతుందట. ఈ మూవీతో వెంకట్ డైరెక్టర్‌గా మారబోతుండటం విశేషం. హై ఆక్టేన్ యాక్షన్ ఎలిమెంట్స్తోపక్కా మాస్ ఎంటర్టైనర్గా సాగనుందని ఇన్సైడ్ టాక్. డాకు మహారాజ్, భగవంత్ కేసరి సినిమాలకు అదిరిపోయే స్టంట్స్ కంపోజ్ చేశాడు వెంకట్. ఈ ఫైట్ మాస్టర్ చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడట గోపీచంద్. ఈ చిత్రాన్ని యాత్ర, యాత్ర 2 లాంటి పొలిటికల్ బయోపిక్స్ తెరకెక్కించిన 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుందని సమాచారం.
అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే ఆగస్టు 9వ తేదీన ఈ సినిమా ప్రకటన కూడా ఉండనుందని తెలుస్తోంది. మొత్తానికి గోపీచంద్ ఈ సారి ఫైట్ మాస్టర్ చెప్పిన కథతో సిల్వర్ స్క్రీన్‌పై ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కొత్తదనంతో కూడిన సినిమాను ప్రేక్షకులకు అందించాలని చూస్తున్న గోపీచంద్ మరి ఈ సారి రూట్ మార్చి స్టంట్ మాస్టర్‌తో చేయబోతున్న సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.
Sathi Leelavathi Teaser | మెగా కోడలి మూవీ టీజర్.. విడాకులు అడిగితే మొగుడ్ని కొట్టి కట్టేసింది..!
90s Re Union | నైంటీస్ స్టార్స్ రీయూనియన్… సీనియర్ హీరో, హీరోయిన్స్ సందడి మాములుగా లేదు..!