90s Re Union | ఈ మధ్య అలనాటి తారలు అందరు ఏదో ఒక సందర్భంలో కలిసి సందడి చేయడం మనం చూస్తూ ఉన్నాం. 80వ దశకంకి చెందిన తారలు సంవత్సరానికి ఒకసారి కలిసి తెగ హంగామా చేస్తుంటారు. 90వ దశకంలో స్టార్ డమ్ పొందిన సినీ ప్రముఖులు కూడా ప్రతి ఏడాది ఒకే చోట కలుసుకొని రీయూనియన్ పార్టీ చేసుకోవడం ఒక ట్రెడిషన్‌గా మారిపోయింది. ఈ ఏడాది ఆ ప్రత్యేక సమ్మేళనానికి గోవా వేదిక అయింది. అక్కడ చోటుచేసుకున్న జాయ్‌ఫుల్ సెలబ్రేషన్స్, సెలెబ్రిటీల సందడికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఈ పార్టీకి సిమ్రాన్, సంగీత, సంఘవి, శ్వేతా మీనన్, మీనా, రీమా సేన్, మహేశ్వరి లాంటి పాపులర్ హీరోయిన్స్ హాజరయ్యారు. తళుకుబెళుకుల గోవా బ్యాక్‌డ్రాప్‌లో, వైట్ అండ్ వైట్ డ్రస్సుల్లో వీరి గ్లామర్ సందడి అభిమానులను అలరించింది. ఇక ఈ రీ యూనియన్‌కి డైరెక్టర్లు శంకర్, కె.ఎస్. రవికుమార్, లింగుసామి, మోహన్ రాజా, కోరియోగ్రాఫర్-డైరెక్టర్ ప్రభుదేవా వంటి స్టార్లు కూడా హాజరై తీపి జ్ఞాపకాలని నెమరవేసుకున్నారు. టాలీవుడ్ నుంచి శ్రీకాంత్, జగపతి బాబు వంటి ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. నాటి స్నేహబంధాలను, అప్పటి మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ తెగ సందడి చేశారు.
ఈ ఫోటోలకు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. “90స్ స్టార్స్ మధ్య ఉన్న స్నేహం, ఇప్పుడు ఉన్న ఫ్రెండ్షిప్లకు ఒక అద్భుత ఉదాహరణ” అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి పాజిటివ్ రీయూనియన్లు చూస్తే సినీ పరిశ్రమలో రిలేషన్షిప్స్ ఏ స్థాయిలో ఉంటాయో మనకు అర్థమవుతుంది. ఈ ఫొటోలలో సిమ్రాన్, ఊహ లుక్స్ అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. సిమ్రాన్ వైట్ హెయిర్‌తో దర్శనమివ్వగా, ఊహ అప్పటికీ ఇప్పటికీ చాలా మారిందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వారి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.