Jaat 2 | టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో సన్నీడియోల్లో నటించిన చిత్రం జాట్. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఈ మూవీతో సన్నీడియోలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడని తెలిసిందే. సన్నీడియోల్ పాత్రకు తెలుగు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించారు.
కాగా జాట్‌కు సీక్వెల్‌గా జాట్ 2కూడా రాబోతుందని తెలిసిందే. అయితే ఇప్పటిదాకా సీక్వెల్‌కు కూడా గోపీచంద్ మలినేని దర్శకుడిగా ఉంటాడని అంతా అనుకున్నారు. మరి సీక్వెల్‌కు డైరెక్టర్ మారబోతున్నాడా..? గోపీచంద్ మలినేని స్థానంలో వేరే దర్శకుడిని తీసుకోవాలనుకుంటున్నారా..? అంటే అవుననే చెబుతున్నాయి తాజా కథనాలు. డ్యూడ్ ప్రమోషన్స్‌లో జాట్ 2 డైరెక్టర్ మారే అవకాశాలున్నాయంటూ మైత్రీ మూవీ మేకర్స్ పరోక్షంగా హింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరి సీక్వెల్‌కు ఎవరు దర్శకత్వం వహిస్తారంటూ చర్చ మొదలైంది.
తాజాగా యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దేవదాస్, హీరో, మనమే చిత్రాలను డైరెక్ట్ చేసిన శ్రీరామ్ ఆదిత్య జాట్ 2ను డైరెక్ట్ చేయనున్నాడంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. గోపీచంద్ మలినేని ప్రస్తుతం బాలకృష్ణతో చేయబోయే పీరియాడిక్ యాక్షన్ డ్రామాపైనే ఫోకస్ పెట్టడంతో.. శ్రీరామ్ ఆదిత్య పేరును పరిశీలిస్తున్నట్టు వార్తలు ఊపందుకున్నాయి. అయితే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Biopic | ఛావా డైరెక్టర్ కొత్త బయోపిక్ .. తెరపైకి ఫోక్ డాన్సర్ జీవిత చరిత్ర
Actor Vijay | విజయ్ వాహనాలన్నింటికీ 0277 నంబర్.. దాని వెనుక ఉన్న ఎమోషనల్ కథ తెలుసా..?
Sara Ali Khan | కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్న సారా అలీ ఖాన్.. ఫొటోలు