మహానటి సినిమాతో స్టార్ డమ్ సంపాదించింది కోలీవుడ్ భామ కీర్తిసురేశ్ (Keerthy Suresh).ఈ సినిమా ఇచ్చిన గుర్తింపుతో ఫీమేల్ ఓరియెంటెడ్ ప్రాజెక్టులను సింగిల్ హ్యాండ్ తో ముందుకు నడిపించే స్థాయికి ఎదిగింది. మహిళా ప్రధాన ఇతివృత్తంతో కీర్తిసురేశ్ నటిస్తోన్న తాజా ప్రాజెక్టు గుడ్ లక్ సఖి (Good Luck Sakhi). నగేశ్ కుకునూర్ (Nagesh Kukkunoor) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ఏడాది జూన్ 3వ తేదీనే గుడ్ లక్ సఖి ప్రేక్షకుల ముందుకు రావాల్సింది..అయితే లాక్డౌన్ ప్రభావంతో వాయిదా పడ్డది.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది. గుడ్ లక్ సఖి చిత్రాన్ని నవంబర్ 26న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. జగపతిబాబు, ఆది పినిశెట్టి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పల్లెటూరి యువతిగా కీర్తిసురేశ్ పోషిస్తున్న పాత్ర సినిమాకే హైలెట్‌గా నిలువనుందని ఇప్పటికే విడుదలైన రషెస్ ద్వారా తెలుస్తోంది.
గుడ్ లక్ సఖి టీజర్‌పై ఓ లుక్కేయండి మరి..
కీర్తిసురేశ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. మహేశ్‌బాబుతో కలిసి సర్కారు వారి పాట, చిరంజీవితో భోళా శంకర్, రజినీకాంత్‌తో పెద్దన్న చిత్రాల్లో నటిస్తోంది కీర్తిసురేశ్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Samantha: సమంత బాలీవుడ్ సినిమాలపై ఆసక్తి చూపడానికి ఆ హీరోయిన్ కారణమా?
Tamannah In Bhola Shankar | భోళా శంకర్‌లో తమన్నా..తాజా అప్డేట్
Chiranjeevi: మెగాస్టార్ న్యూ లుక్.. షాక్ అవుతున్న ఫ్యాన్స్
Puneet Raj Kumar: పునీత్ చివరి సినిమా కోసం మేకర్స్ సరికొత్త ప్రయత్నం..!