RRR | నాటునాటు పాటకు ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్
RRR | టాలీవుడ్ టాప్ దర్శకుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా చరిత్ర సృష్టించింది. ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డును (Golden Globe Awards) దక్కించుకున్నది.
కాలిఫోర్నియా: టాలీవుడ్ టాప్ దర్శకుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా చరిత్ర సృష్టించింది. ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డును (Golden Globe Awards) దక్కించుకున్నది. సినిమాలోని ‘నాటునాటు’ పాట ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఉత్తమ పాటగా ఎంపికైంది. అతిరథ మహారథుల మధ్య ఈ అవార్డును సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందుకున్నారు. ప్రముఖ రచయిత చంద్రబోస్ ఈ పాటకు సాహిత్యం అందించారు. ఈ మాస్ సాంగ్‌లో ఎన్టీఆర్, రామ్‌చరణ్ వేసిన స్టెప్పులు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను ఉర్రూతలూగించాయి.
The winner for Best Song – Motion Picture is @mmkeeravaani for their song "Naatu Naatu" featured in @rrrmovie! Congratulations! 🎥✨🎵 #GoldenGlobes pic.twitter.com/ePaXzJ1AoL
— Golden Globes (@goldenglobes) January 11, 2023
గోల్డెన్‌గ్లోబ్ అవార్డులు-2023 వేడుక అమెరికాలోని కాలిఫోర్నియాలో జరుగుతున్నది. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ సినిమా బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ నాన్ ఇంగ్లిష్ మూవీ విభాగాల్లో నామినేట్ అయింది. ఇందులో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డును దక్కించుకున్నది. కాగా, మొదటిసారిగా ఒక భారతీయ సినిమాకు అందులోనూ ఓ తెలుగు సినిమాకు ఈ అవార్డు దక్కడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఆస్కార్ బరిలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నది.

చాలా సంతోషంగా ఉంది: కీరవాణి
గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి అన్నారు. ప్రతిష్ఠాత్మక అవార్డు ఇచ్చిన హెచ్ఎఫ్పీఏకు ధన్యవాదాలు తెలిపారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డు తన సోదరుడికి దక్కాలని చెప్పారు. పాటలో భాగమైన రాహుల్ సిప్లిగంజ్‌కు ధన్యవాదాలు తెలిపారు. పాటకు కాళభైవర అద్భుత సహకారం అందిచారన్నారు. సంతోష సమయాన్ని తన భార్యతో పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు.
And the GOLDEN GLOBE AWARD FOR BEST ORIGINAL SONG Goes to #NaatuNaatu #GoldenGlobes #GoldenGlobes2023 #RRRMovie
— DVV Entertainment (@DVVMovies) January 11, 2023

వాట్ ఈజ్ నాటు.. గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న ఈ పాట ఎలా పుట్టిందో తెలుసా?
దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. కమర్షియల్‌గానే కాదు అవార్డుల పరంగానూ ఈ సినిమా దూసుకెళ్తుంది. తాజాగా ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టించింది. ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డును ట్రిపుల్ఆర్ సొంతం చేసుకుంది. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ‘నాటు నాటు’ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకుంది. ఆసియా నుండి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న తొలి పాట ఇదే కావడం విశేషం. ఈ అవార్డు గెలుచుకోవడం పట్ల పలువురు సినీ ప్రముఖులు ఆర్ఆర్ఆర్… Read More>>
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

