Glopixs | ఓ వైపు థియేటర్లు.. మరోవైపు టెలివిజన్ వినోదాన్ని అందిస్తున్న సమయంలో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల ఫోకస్ అంతా తమవైపునకు తిప్పుకున్నాయి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్. ఇప్పటికే చాలా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ (OTT Platforms)ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాయి. వాటన్నింటికీ ధీటుగా సరికొత్త కథనాలతో ఎంటర్టైన్ చేస్తామంటూ మరో ప్లాట్‌ఫాం మార్కెట్లోకి వచ్చేస్తుంది. డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా మార్కెట్లోకి గ్లోపిక్స్ (Glopixs) రాబోతుంది.
నయా ఓటీటీ ప్లాట్‌ఫాం గ్లోపిక్స్ లోగోను నేడు అధికారికంగా ఆవిష్కరించారు. బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్‌లలో ఈ లోగోను లాంచ్ చేశారు. ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, డాక్యుమెంటరీలు, రియాలిటీ షోలతో వినోదాన్ని అందించబోతున్నారు. మన సంస్కృతి, మూలాల నుంచి కథలను తీసుకొని ప్రపంచానికి అందించేందుకు గ్లోపిక్స్‌ను లాంచ్ చేస్తున్నామని గ్లోపిక్స్ ఫౌండర్ మెంబర్ మారుతి రాజీవ్ పేర్కొన్నారు. ప్రాంతీయతను చాటే, లోకల్ టాలెంట్, సంస్కృతిని ప్రోత్సహించేందుకు ఈ ప్లాట్‌ఫాంను ప్రారంభిస్తున్నట్టు మరో మెంబర్ లోకేశ్ చెప్పారు.
గ్లోపిక్స్‌ను అనిత, విన్సే ఎల్ఏ సంయుక్తంగా నెలకొల్పారు. లోకేశ్ ఫౌండర్ మెంబర్/సిఎమ్ఓ ఫౌండింగ్ మెంబర్‌గా వ్యవహరిస్తుండగా.. మారుతి రాజీవ్ ఫౌండర్ మెంబర్/సిటీఓ, రూపేశ్ మామిళ్లపల్లి హైదరాబాద్ కంటెంట్ హెడ్‌గా వ్యవహరించనున్నారు.
#Glopixs Logo Launch Glimpse Event held by lightning Jyothi today pic.twitter.com/HcA68J1VZ4
— Sai Satish (@PROSaiSatish) January 2, 2025
VidaaMuyarchi | రెండు తేదీలపై అజిత్ కుమార్ టీం ఫోకస్.. విదాముయార్చి ఏ డేట్‌కు రిలీజయ్యేనో..?
Mega family | జంగిల్లో మెగా ఫ్యామిలీ న్యూఇయర్ అడ్వెంచర్.. ఇంతకీ వీళ్లంతా ఎక్కడికెళ్లారో తెలుసా..?