Sabdham | తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాక్టర్ ఆది పినిశెట్టి (Aadhi Pinishetty). ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తోన్న తాజా చిత్రం శబ్దం (Sabdham). ఈ చిత్రానికి వైశాలి ఫేం అరివజగన్ వెంకటాచలం (Arivazhagan Venkatachalam) దర్శకత్వం వహిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి తెరపైకి వచ్చింది.
సౌండ్ థ్రిల్లర్గా రాబోతున్న ట్రైలర్ ఫిబ్రవరి 19న (రేపు) లాంచ్ కానుందని తెలియజేశారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ క్యూరియాసిటీ పెంచేస్తుంది. ఈ మూవీని 2025 ఫిబ్రవరి 28న విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ.. భయం శబ్ధం భయపెట్టించేందుకు వస్తోంది.. అంటూ లాంచ్ చేసిన కొత్త పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
హార్రర్ థ్రిల్లర్ జోనర్లో రాబోతున్న ఈ చిత్రంలో అలనాటి అందాల తార లైలా కీలక పాత్రలో నటిస్తోంది. సిమ్రన్, లక్ష్మీ మీనన్, రెడిన్ కింగ్ స్లే ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వైశాలి తర్వాత ఆది పినిశెట్టి, అరివజగన్ వెంకటాచలం కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. ఈ సినిమాను 7జీ ఫిలిమ్స్, అల్ఫా ఫ్రేమ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
The sound of thrills is getting LOUDER! 🔥 Hold on tight!#Sabdham Trailer is arriving to haunt from 19-02-2025 🗓️
Get ready for a #SoundThriller ❤️🔥
From the makers of #Vaishali #SabdhamTrailer #SabdhamFromFeb28 pic.twitter.com/RdY4fCPr1B
— BA Raju’s Team (@baraju_SuperHit) February 18, 2025
Mazaka | సందీప్ కిషన్ మజాకా టీం క్రేజీ ప్లాన్.. రావులమ్మ సాంగ్ లైవ్ ఫిల్మ్ షూట్ చూశారా..?
Chhaava: విక్కీ కౌశల్ ఛావా కొత్త రికార్డు.. 3 రోజుల్లో 164 కోట్లు వసూల్