కొత్త దనంతో కూడిన సినిమాలు తీసే డైరెక్టర్ లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో ఉంటాడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautam Menon). ఈ స్టార్ డైరెక్టర్లో మంచి నటుడున్నాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గౌతమ్ మీనన్ ప్రస్తుతం పా రంజిత్ (Pa.Ranjith)దర్శకత్వంలో తెరకెక్కుతున్న అన్బు సెల్వన్ (Anbu Selvan first look) చిత్రంలో కీ రోల్ చేస్తున్నాడు. పా రంజిత్ టీం సోషల్‌మీడియా ద్వారా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. అయితే గౌతమ్ మీనన్ మాత్రం అందరికీ షాకిచ్చే స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఆయనకు ఈ సినిమా గురించి ఏం తెల్వదట.
ఇది నాకు ఆశ్చర్యం కలిగించే వార్త. ఈ సినిమాలో ఎలా నటిస్తున్నానో తెలియదు. ఈ పోస్టర్ లో ఉన్న డైరెక్టర్ ఎవరో నాకు తెలియదు..ఆ డైరెక్టర్ ను నేను కలువలేదు. నిర్మాతలు ట్వీట్ చేయడానికి పెద్ద పేర్లను వాడుకున్నారు. ఇది షాకింగ్‌గా ఉంది. అంత సులభంగా ఇలా ఎలా చేస్తారో భయంగా ఉంది అంటూ వ్యాఖ్యలు చేశాడు గౌతమ్ మీనన్.
ఈ స్టార్ డైరెక్టర్ చేసిన కామెంట్లు ఇండస్ట్రీ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మరి గౌతమ్ మీనన్ కామెంట్స్ పై మేకర్స్, పా రంజిత్ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.
This is shocking & news to me.I have no idea what this film is that I’m supposed to be acting in.I don’t know or haven’t met the director whose name is on this poster.Producer has got big names to tweet this. It’s shocking & scary that something like this can be done so easily. https://t.co/CnMaB3Qo90
— Gauthamvasudevmenon (@menongautham) November 3, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Janhvi Kapoor Langa Voni | లంగావోణిలో జాన్వీకపూర్..దీపావళి లుక్ అదిరింది
Shyam Singha Roy | స్పెషల్ అట్రాక్షన్‌గా ‘శ్యామ్ సింగరాయ్’ భామల ఫస్ట్ లుక్
SS Rajamouli wish suryavanshi team | మొన్న అల్లు అర్జున్..నేడు రాజమౌళి