దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు (Diwali celebrations) ఘనంగా కొనసాగుతున్నాయి. ప్రజలంతా ఆనందోత్సాహాలతో టపాసులు కాలుస్తూ దీపావళిని జరుపుకుంటున్నారు. సెలబ్రిటీలు ట్రెండీ స్టైల్‌ను పక్కన పెట్టి సంప్రదాయ వస్త్రధారణలో పండుగ జరుపుకున్నారు. బాలీవుడ్ (Tollywood) బ్యూటీ జాన్వీకపూర్ (Janhvi Kapoor) ముంబైలోని నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి దీపావళిని జరుపుకుంది. పొట్టి దుస్తుల్లో కనిపించే జాన్వీకపూర్ ఈ సారి లంగావోణి పల్లెటూరి అమ్మాయిలా కనిపించింది.
జాన్వీ సోదరి ఖుషీకపూర్ కూడా లంగావోణి వేసుకోగా..బోనీకపూర్ వైట్ అండ్ వైట్ కుర్తా పైజామా వేసుకున్నారు. జాన్వీకపూర్ తన తల్లి శ్రీదేవి జ్ఞాపకాలను గుర్తు చేసేలా వేసుకున్న సంప్రదాయ వస్త్రధారణ లుక్కు సంబంధించిన ఫొటోలు ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
జాన్వీకపూర్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉంది. దోస్తానా 2, మిల్లి చిత్రాలు షూటింగ్ దశలో ఉండగా..గుడ్ లక్ జెర్రీ చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
SS Rajamouli wish suryavanshi team | మొన్న అల్లు అర్జున్..నేడు రాజమౌళి
Samantha Super heroes | ఆ సూపర్ హీరోలకు సమంత సపోర్ట్..ఆసక్తిగా వెయిటింగ్
Keerthy Suresh Selfie | అందాల తారలతో కీర్తిసురేశ్ సెల్ఫీ
Rajasekhar Sankranthi race | సంక్రాంతి రేసులో రాజ ‘శేఖర్’..?