టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్, టాలెంటెడ్ నటీమణుల్లో రాశీ ఖన్నా ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు ఈ అందాల రాశి పరిచయమైన రాశీ మొదట్లో బొద్దుగా కనిపించింది. ఇప్పుడు చాలా స్లిమ్‌గా మారింది. సన్నజాజి తీగలా మారి.. తన అందాలతో కుర్రకారును ఉర్రూతలూగించేస్తోంది. బరువు పెరగకుండా ఉండేందుకు క్రమం తప్పకుండా ప్రతిరోజూ వ్యాయామం చేస్తుందట.
తాజాగా రాశీ ఖన్నాఅరణ్మనై 3 సినిమా ప్రమోషన్లో భాగంగా ఫొటో షూట్ చేసింది. ఇందులో రాశీ ఖన్నా క్యూట్ లుక్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. రాశీలోని కొత్త యాంగిల్‌కు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.ప్రస్తుతం తమిళంలో సర్దార్ అనే సినిమాలోను నటిస్తుంది. ఈ రెండు సినిమాలు విజయం సాధిస్తే తమిళ్లోనూ రాశి ఖన్నా హవా జోరుగా ఉండనుంది. ఈ సినిమాలతోపాటు రాశిఖన్నా చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇలా మొత్తం తమిళ్ లో 5 సినిమాలు చేస్తుంది ఈ చిన్నది.తెలుగులోను ఈ అమ్మడు బిజీగానే ఉంది.