Game Changer | పైరసీ (Piracy)పై గేమ్ ఛేంజర్ టీం సైబర్ క్రైమ్ విభాగాన్ని ఆశ్రయించింది. విడుదల రోజే పైరసీ రావడంపై గేమ్ ఛేంజర్ టీం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పైరసీ వెనుక 45 మంది ఉన్నారని చిత్రయూనిట్ ఫిర్యాదులో పేర్కొంది.
నిర్మాతతోపాటు సినిమా టీమ్‌ను సోషలోమీడియాలో కొందరు బెదిరించారని.. అడిగిన డబ్బు ఇవ్వకపోతే పైరసీ లీక్ చేస్తామన్నారు. పైరసీని టెలిగ్రామ్, సోషల్ మీడియాలో షేర్ చేశారని గేమ్ ఛేంజర్ యూనిట్ ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
AjithKumar | దేశం గర్వించేలా.. దుబాయ్‌లో అజిత్‌కుమార్ టీం ఆనందకర క్షణాలు