Game changer | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ మూవీ గేమ్ ఛేంజర్(Game changer). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. కార్తీక్ సుబ్బరాజు కథను అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ మూవీ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అభిమానుల ఎదురుచూపులకు బ్రేక్ చేస్తూ.. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.
అయితే ఈ సినిమా విడుదలకు ఇంకా 8 రోజులు కూడా లేకపోవడంతో తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. పొలిటికల్ థిల్లర్‌గా రానున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. రన్ టైం విషయానికి వస్తే.. 165.30 నిమిషాల (2:45 గంటలు) రన్టైమ్తో ఈ సినిమా అలరించడానికి సిద్ధమైంది. మరోవైపు ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు మేకర్స్.
ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో నటించబోతున్నాడు. రామ్నందన్ అనే యువ ఐఏఎస్ అధికారిగా కనిపించడంతో పాటు, తండ్రి అప్పన్న పాత్రనూ ఆయనే చేశారు. కియరా అద్వాని, అంజలి, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్, నాజర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also read..