Idly Kadai | గతేడాది ‘కెప్టెన్ మిల్లర్’, ‘రాయన్’ వంటి సినిమాలతో సూపర్ హిట్లను అందుకున్నాడు ధనుష్. రాయన్ సినిమాతో అయితే మెగఫోన్ పట్టి మరోసారి దర్శకుడిగా నిరుపించుకున్నాడు. అయితే ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘ఇడ్లీ కడై (ఇడ్లీ కొట్టు)’. ఈ చిత్రంలో ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తూ.. దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాను డాన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా.. నిత్యమీనన్ కథానాయికగా నటిస్తుంది. అయితే న్యూ ఇయర్ కానుకగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే.. గ్రామీణ నేపథ్యంలో తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ సినిమాను సమ్మర్ కానుకగా.. ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాతో పాటు ఇళయరాజా బయోపిక్, శేఖర్ కమ్ముల కుబేరా సినిమాలో నటిస్తున్నాడు ధనుష్.
First Look of #IdlyKadai pic.twitter.com/t9t70bkWKX
— BA Raju’s Team (@baraju_SuperHit) January 1, 2025