Game Changer konda Devara Song | అగ్ర కథానాయకుడు రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ సినిమా వస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. దిగ్గజ దర్శకుడు శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
ఇప్పటికే మూవీ నుంచి ట్రైలర్‌తో పాటు పాటలను విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. అయితే తాజాగా ఈ మూవీ నుంచి జాతర సాంగ్ కొండ దేవర (konda Devara) పాటను విడుదల చేశారు మేకర్స్. ‘నెత్తురంతా ఉడుకుతున్న ఊరువాడ జాతర’ అంటూ సాగే పవర్ ఫుల్ లిరిక్స్‌ను కాసర్ల శ్యామ్ అందించగా.. తమన్, శ్రావణ భార్గవి దీన్ని ఆలపించారు.
Also Read..