Sharwa 37 Title and first look | హిట్టు ప్లాప్‌లు సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు టాలీవుడ్ నటుడు శర్వానంద్. గతేడాది మనమే అంటూ వచ్చి విజయాన్ని అందుకున్నాడు. అయితే ఈ నటుడు ప్రధాన పాత్రలో వస్తున్న తాజా ప్రాజెక్ట్ శర్వా 37. ‘సామజవరగమన’ దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. వారిలో ఒకరు సంయుక్త కాగా… మరొకరు యంగ్ బ్యూటీ సాక్షి వైద్య. ఇప్పటికే ఈ సినిమా నుంచి శర్వానంద్ తో పాటు సాక్షి వైద్య ఫస్ట్ లుక్స్ రిలీజ్ అయ్యాయి. తాజాగా ఈ మూవీ నుంచి టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ టైటిల్ లాంచ్ కోసం నందమూరి హీరోతో పాటు కొణిదెల హీరో ముఖ్య అతిథులుగా రానున్నట్లు చిత్రబృందం తెలిపింది. అయితే వారేవరు అనేది తెలియాలంటే జనవరి 14 వరకు వెయిట్ చేయాల్సిందే.
ఈ మూవీకి ‘నారీ నారీ నడుమ మురారి’ అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. గతంలో ఇదే పేరుతో బాలయ్య ఓ సినిమా చేశారు. ఎకె ఎంటర్టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.
Two Powerhouses, 𝑵𝑨𝑵𝑫𝑨𝑴𝑼𝑹𝑰 & 𝑲𝑶𝑵𝑰𝑫𝑬𝑳𝑨 are coming together for our Charming Star @ImSharwanand 🔥
Get ready for the grand reveal of #Sharwa37 Title and first look on JAN 14TH 💥🤩
Stay tuned for the excitement 😉 @iamsamyuktha_ @sakshivaidya99 @ItsActorNaresh… pic.twitter.com/7XqlWrowEd
— AK Entertainments (@AKentsOfficial) January 8, 2025