న్యూఢిల్లీ, మే 29: దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో లాభాలకు ఫారెక్స్ సెగ గట్టిగానే తాకింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.2,536.9 కోట్ల నష్టాలను చవిచూసింది. గడిచిన త్రైమాసికంలో సంస్థ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నదని, ముఖ్యంగా నిర్వహణ సమస్యలు అధికం కావడం, రూపాయి తరుగుదల మొత్తం లాభాలపై ప్రతికూల ప్రభావం చూపిందని ఇండిగో పేర్కొంది.
క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.3,067.5 కోట్ల లాభాన్ని గడించింది. అలాగే సమీక్ష కాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన మూడు శాతం ఎగబాకి రూ.23,830.7 కోట్లకు చేరుకున్నట్టు ఇండిగో వివరించింది.