Sukumar | టాలీవుడ్ స్టార్ యాక్టర్ రాంచరణ్ (Ram Charan) టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం గేమ్‌ఛేంజర్ (Game Changer). స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ, అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రాన్ని 2025 జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా డల్లాస్‌లో ఏర్పాటుచేసిన గేమ్‌ఛేంజర్ గ్లోబల్ ఈవెంట్లో డైరెక్టర్ సుకుమార్ మాట్లాడిన మాటలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ సినిమాను చిరంజీవితో కలిసి చూశాను. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని.. ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్ అని చెప్పాడు. ఇక సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గూస్బంప్స్ తెప్పించడం ఖాయమన్నాడు.
రాంచరణ్ క్లైమాక్స్‌లో అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ అందించాడని చెప్పాడు. నేను సినిమా తీస్తున్నప్పుడు చాలా ప్రేమిస్తాను. ఆ సినిమా చేస్తాను. ఎప్పుడు సినిమా అయిపోయినా నేనెప్పుడు ఎవరితో ఎక్కువగా కనెక్ట్ అయి ఉండను. రంగస్థలం అయిపోయాక కూడా నా అనుబంధం అలాగే కొనసాగిన ఒకే ఒక హీరో చరణ్.. అంటూ చెప్పుకొచ్చాడు ఇప్పుడీ కామెంట్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.
ఈ చిత్రంలో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్, ఎస్జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తుండగా..ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Naga Vamsi | అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా కోసం స్పెషల్ స్టూడియో.. నాగవంశీ కామెంట్స్ వైరల్
Second Marriages | 2024 రౌండప్.. రెండోసారి పెళ్లి పీటలెక్కిన సెలబ్రిటీలు వీళ్లే..!