తరుణ్‌భాస్కర్ నటించిన ‘గాయపడ్డ సింహం’ నేడు ప్రేక్షకుల ముందుకొస్తున్న విషయం తెలిసిందే. కశ్యప్ శ్రీనివాస్ దర్శకుడు. ఈ సినిమాలో శ్రీవిష్ణు అతిథి పాత్రలో కనిపించనున్నారు. అమెరికా వీసా కష్టాల నేపథ్యంలో వినోదాత్మకంగా సాగే కథ ఇది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సీక్వెల్‌కు కూడా సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.
అందుకే శ్రీవిష్ణుని గెస్ట్‌రోల్‌లో తీసుకున్నారని, సీక్వెల్లో ఆయనే కథానాయకుడిగా నటిస్తారని అంటున్నారు. దీనికి ‘పోరాట సింహం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఫిల్మ్‌నగర్ టాక్. ‘గాయపడ్డ సింహం’ ైక్లెమాక్స్లోనే సీక్వెల్‌కు సంబంధించిన హింట్ ఇవ్వబోతున్నారట.