మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జిన్నా (Ginna). బాలీవుడ్ భామ సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ముందుగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. జిన్నా టెంట్ హౌస్ నిర్వహించే యజమాని జిన్నా పాత్రలో కనిపించబోతున్నట్టు టీజర్ (Ginna Teaser)తో తెలిసిపోతుంది.
జిన్నా జీవితంలోకి సన్నీలియోన్ లక్ష్మీదేవిలా పచ్చబస్సు ఎక్కి రంగంపేటలో దిగిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేది టీజర్లో సస్పెన్స్ లో పెడుతూ..సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నాడు డైరెక్టర్ ఇషాన్. డైరెక్టర్ ఇషాన్ ఈ సినిమాతో విష్ణుకు మంచి బ్రేక్ఇవ్వాలని గట్టిగా ఫిక్సయినట్టు టీజర్‌తో అర్థమవుతుంది.
విలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగే ఈ ఫన్ ఎంటర్టైనర్కు కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ..క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీతో కలిసి హోం బ్యానర్ ఏవీఏ ఎంటర్టైన్మెంట్ (AVA Entertainment)పై మంచు విష్ణు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్.
1️⃣ Million + ᴠɪᴇᴡꜱ for #𝐆𝐢𝐧𝐧𝐚𝐓𝐞𝐚𝐬𝐞𝐫💥
𝕀ℂ𝕐𝕄𝕀:
हिन्दी▶️https://t.co/SekFmfmnYL
മലയാളം▶️https://t.co/2JMo5HuPoW
తెలుగు▶️https://t.co/tjy5lIeQnL@iVishnuManchu @starlingpayal @SunnyLeone@konavenkat99 #ChotaKNaidu #Premrakshith @eeshaansuryaah @anuprubens pic.twitter.com/sU3lhqvtMo— 24 Frames Factory (@24FramesFactory) September 9, 2022