Jana Nayagan | తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్(Thalapathy Vijay) మరికొన్ని రోజుల్లో సినిమాలు దూరమవుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ తమిళ వెట్రి కళగం(TVK) అనే పార్టీని స్థాపించాడు. ఇక నుంచి తాను పూర్తిగా రాజకీయల్లోనే ఉంటానని.. ఇదే తన చివరి చిత్రం అంటూ దళపతి69 (Thalapathy69) ప్రాజెక్ట్‌ను ప్రారంభించాడు. జన నాయగన్ (ప్రజల నాయకుడు) అనే టైటిల్‌తో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను కార్తీ (ఖాకీ) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఒక సాలిడ్ అప్డేట్ వచ్చింది. మరో 8 రోజుల్లో విజయ్ పుట్టినరోజు రాబోతుంది. ఈ సందర్భంగా అభిమానుల కోసం మేకర్స్ భారీ సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. జూన్ 22న జననాయగన్ ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేస్తున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనుండగా.. కన్నడ టాప్ బ్యానర్ కేవీఎన్ ప్రోడక్షన్ ఈ మూవీని నిర్మిస్తుంది. పూజ హెగ్దేతో పాటు ప్రేమలు ఫేమ్ మమితా బైజు ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాను జనవరి 09 2026న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ఇప్పటికే వెల్లడించింది.
Read More