Iran Airspace | పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ (Israel) వైమానిక దళం ఇరాన్‌పై (Iran) ముందస్తు దాడులకు దిగింది. అణు కర్మాగారాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా టెహ్రాన్‌పై బాంబుల వర్షం కురిపించింది. శుక్రవారం ఉదయం దేశ రాజధానిలో పేలుళ్ల శబ్ధం వినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారని ఇరాన్ అధికార మీడియా వెల్లడించింది. దీనికి ప్రతిగా టెహ్రాన్ సైతం ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులకు దిగింది. డ్రోన్లతో విరుచునుపడుతోంది. ఈ దాడులను ఇజ్రాయెల్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది.
ఇక ఇజ్రాయెల్ దాడులతో అప్రమత్తమైన ఇరాన్ తన గగనతలాన్ని (Iran Airspace) మూసి వేసిన విషయం తెలిసిందే. దీంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ, ముంబై నుంచి లండన్, న్యూయార్క్‌కు వెళ్లే అనేక విమానాలు ప్రభావితమయ్యాయి. పలు విమానాలను దారిమళ్లించగా.. మరికొన్ని వెనక్కి తిరిగివస్తున్నాయి. దాదాపు 16 ఎయిర్ ఇండియా విమానాలను దారి మళ్లించినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది.
Also Read..
Israel | అణు, సైనిక స్థావరాలే లక్ష్యంగా.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి
Mohammad Bagheri: ఇజ్రాయిల్ దాడిలో ఇరాన్ మిలిటరీ చీఫ్ మొహమ్మద్ భగేరి మృతి