టెహ్రాన్: ఇరాన్‌పై విరుచుకుపడింది ఇజ్రాయిల్. ఇరాన్‌లోని అణ్వాయుధ స్థావరాలు, సీనియర్ సైనిక నేతల్ని టార్గెట్ చేసింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్‌పై దాడులకు పాల్పడింది ఇజ్రాయిల్. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ ప్రధాని నెతాన్యహూ ద్రువీకరించారు. ఇజ్రాయిల్ జరిపిన దాడిలో ఇరాన్ సైనిక బలగాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ మొహమ్మద్ భగేరి( Mohammad Bagheri) మృతిచెందారు. ఇరాన్ సైనిక దళాల్లో అత్యున్నత ర్యాంక్ కలిగిన ఆఫీసర్ భగేరి. శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయిల్ జరిపిన దాడిలో మృతిచెందిన వ్యక్తుల్లో భగేరి రెండో కీలక వ్యక్తిగా నిలిచారు. తాజా దాడిలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ హుస్సేన్ సలామీ కూడా మృతిచెందారు.
ఆపరేషన్ రైజింగ్ లయన్‌లో భాగంగా నిర్వహించిన దాడుల్లో.. నటాంజ్‌లో ఉన్న అణు శుద్దీకరణ కేంద్రాన్ని టార్గెట్ చేశారు. అణు శాస్త్రవేత్తలను కూడా దాడుల్లో టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ చేపడుతున్న బాలిస్టిక్ మిస్సైల్ ప్రోగ్రామ్‌కు.. నటాంజ్ కేంద్రం ప్రధానంగా నిలుస్తోంది. తాజాగా ఇజ్రాయిల్ చేపట్టిన దాడుల్లో అమెరికా సహాయం కానీ, పాత్ర కానీ లేదని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబో తెలిపారు. మరో వైపు అదివారం ఒమన్ దేశం వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య అణ్వాయుధ కేంద్రాలపై చర్చలు జరగనున్నాయి.
Also Read..