న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ మరో దేశంతో యుద్ధానికి దిగింది. గత కొన్ని నెలలు హమాస్‌ను తుదముట్టించే పేరుతో పాలస్తీనాపై ఏకపక్షంగా బాంబుల మోతమోగిస్తున్న నెతన్యాహూ సైన్యం.. తాజాగా ఇరాన్‌పై దాడులకు (Israel Iran War) దిగింది. అణు కర్మాగారం, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దళం దాడులు చేసింది. డజన్ల కొద్దీ దాడులు జరిగియాని సమాచారం. దీంతో ఇరాన్‌కు భారీ నష్టం జరిగినట్లు తెలుస్తున్నది. ఆ దేశ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్స్ అధిపతి హుస్సేన్ సలామీ మృతిచెందారు. ఈ మేరకు ఇరానియన్ స్టేట్ టెలివిజన్ తెలిపింది.
కాగా, ఇరాన్‌పై దాడులను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పందించారు. ఇరాన్‌పై ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించామని ప్రకటించారు. ఇరాన్ అణ్వాయుధీకరణ కార్యక్రమం, అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించారు. ఇరాన్ ముప్పును తిప్పికొట్టడమే టార్గెట్‌గా సైనిక చర్య చేపట్టామని చెప్పుకొచ్చారు. ఇరాన్ ముప్పు తొలగించడానికి ఎన్ని రోజులైనా ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారు.
Benjamin Netanyahu full statement on Iran’s attack:
“We struck at the heart of Iran’s nuclear enrichment program, Iran’s nuclear weaponization program, Iran’s main enrichment facilities, leading nuclear scientists, and ballistic missile programs.”pic.twitter.com/EBGMLi23Aj
— Vivid.🇮🇱 (@VividProwess) June 13, 2025
ఇరాన్‌పై దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ప్రత్యేక అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇరాన్ ప్రతి దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ దేశ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ వెల్లడించారు. దేశంలో దాడులు జరుగవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇరాన్లో తాము దాడులు నిర్వహించామని, దీంతో ఇజ్రాయెల్‌లో కూడా క్షిపణి లేదా డ్రోన్ దాడులు జరుగవచ్చని తెలిపారు.