Anasuya | టాలీవుడ్ బుల్లితెరపై యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి, తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకున్న నటి అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం సినిమాల్లో కూడా తనదైన ముద్ర వేస్తోంది. ‘జబర్దస్త్’ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన అనసూయ, ఆ తర్వాత వెండితెరపై వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది. ముఖ్యంగా గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్లను ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్త పాత్రతో అనసూయ నటిగా కొత్త గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. అనంతరం ‘పుష్ప’ సినిమాలో దాక్షాయణిగా కనిపించి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించింది. ఇలా ఒక్కో చిత్రంలో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది.
ఇదిలా ఉంటే.. ఇటీవల అనసూయ తన కుటుంబంతో కలిసి సమ్మర్ వెకేషన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ట్రిప్‌లో ఆమెకు ఊహించని ఓ స్పెషల్ మూమెంట్ దక్కింది. సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో లెజెండరీ స్టార్‌గా పేరు తెచ్చుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్‌ను అనసూయ ప్రత్యక్షంగా కలిసింది. ఈ సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.అంతేకాకుండా “మై ఆల్ టైమ్ ఫేవరెట్” అంటూ రజినీకాంత్‌పై తన అభిమానాన్ని వ్యక్తపరిచింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అనసూయ ముఖంలో కనిపిస్తున్న ఆనందం, రజినీకాంత్‌తో ఆమెకు ఉన్న అభిమానం ఫోటోల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ ఫోటోలపై సోషల్ మీడియాలో పలు ఆసక్తికర చర్చలు కూడా జరుగుతున్నాయి. కొందరు నెటిజన్లు రజినీకాంత్ నటిస్తున్న తదుపరి చిత్రంలో అనసూయకు కీలక పాత్ర దక్కిందని, అందుకే ఈ ఫోటోల ద్వారా హింట్ ఇచ్చిందని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం ఇది పూర్తిగా అభిమానంతో దిగిన ఫోటో మాత్రమేనని, సెలవుల్లో అనుకోకుండా కలిసిన సందర్భమని చెబుతున్నారు.ఏదేమైనా, సూపర్ స్టార్ రజినీకాంత్‌తో అనసూయ దిగిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. మరోవైపు అనసూయ నటిగా వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతుండగా.. ఆమె తదుపరి ప్రాజెక్టులపై కూడా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.