Filmfare Awards South 2024 – Kannada | 69వ శోభ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024(Filmfare Awards 2024) కన్నడ సినిమాకు సంబంధించి రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరదాచే ఎల్లో (తెలుగులో సప్త సాగరాలు దాటి) సినిమా సత్తా చాటింది. ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ నటుడు, ఉత్తమ నటి(క్రిటిక్స్) సహా పలు అవార్డులను గెలుచుకుంది. ఇక స్వాతి ముత్తిన మేల్ హానియే (Swathi Mutthina Male Haniye) సినిమాలో నటనకు గాను సిరి రవి కుమార్ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. ఫిలిం ఫేర్ అవార్డులలో కన్నడ విజేతలు చూసుకుంటే..
ఉత్తమ నటుడు : రక్షిత్ శెట్టి (సప్త సాగరదాచే ఎల్లో) (తెలుగులో సప్త సాగరాలు దాటి)
ఉత్తమ నటి : సిరి రవి కుమార్ (స్వాతి ముత్తిన మేల్ హానియే)
ఉత్తమ చిత్రం : డేర్డెవిల్ ముస్తాఫా
ఉత్తమ దర్శకుడు : హేమంత్ రావు (సప్త సాగరదాచే ఎల్లో)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) : పూర్ణచంద్ర మైసూరు (ఆర్కెస్ట్రా మైసూరు)
ఉత్తమ నటి (క్రిటిక్స్) : రుక్మిణి వసంత్ (సప్త సాగరదాచే ఎల్లో)
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) : పింకీ ఎల్లి (పృథ్వీ కోననూర్)
ఉత్తమ సహాయ నటి : సుధా బెలవాడి (కౌసల్యా సుప్రజా రామ)
ఉత్తమ సహాయ నటుడు : రంగాయణ రఘు (తగరు పాళ్య)
ఉత్తమ పరిచయ నటుడు : శిశిర్ బైకాడి (డేర్ డెవిల్ ముస్తఫా)
ఉత్తమ పరిచయ నటి : అమృత ప్రేమ్ (తగరు పాళ్య)
ఉత్తమ నేపథ్య గాయకుడు (మేల్) : నదియే ఓ నదియే (సప్త సాగరదాచే ఎల్లో సైడ్ ఎ)
ఉత్తమ నేపథ్య గాయని (ఫిమేల్) : కడలను కాన హోరాతిరో (సప్త సాగరదాచే ఎల్లో సైడ్ ఎ)
Also Read..
Friendship day gift | నేస్తానికో కానుక.. మార్కెట్లో బెస్ట్ ఫ్రెండ్ లాకెట్లు
KTR | ఇది మీ కష్టానికి దక్కిన ప్రతిఫలం.. వేణు యెల్దండిని అభినందించిన కేటీఆర్
Filmfare Awards South | ఉత్తమ చిత్రం బలగం.. బెస్ట్ డైరెక్టర్ వేణు యెల్దండి