హైదరాబాద్: తెలంగాణ నేపథ్యంలో రూపొందిన సినిమాలకు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు (Filmfare Awards South) వరించాయి. ఉత్తమ చిత్రంగా బలగం, దసరాలో నటనకు గాను బెస్ట్ హీరోగా నాని, ఉత్తమ దర్శకుడిగా వేణు యేల్డండి నిలిచారు. 69వ ఫిల్మ్‌ఫేర్ సౌత్-2024 వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు.
కుటుంబ బంధాలను చాటుతూ చిన్న చిత్రంగా విడుదలై వద్ద భారీ విజయాన్ని అందుకున్న ‘బలగం’ (Balagam) ఉత్తమ చిత్రంగా నిలిచింది. తొలి ప్రయత్నంలోనే వేణు యెల్దండి (Venu Yeldandi) ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. బలగం సినిమాకు మరో అవార్డు కూడా వచ్చింది. ఉత్తమ సహాయ నటిగా రూపలక్ష్మి అవార్డు అందుకున్నారు. ఇక ‘దసరా’లో నటనకు గానూ నాని, కీర్తి సురేశ్‌లు ఉత్తమ నటీనటులుగా, ఉత్తమ పరిచయ దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్యువ్ (హాయ్ నాన్న) ఎంపికయ్యారు. మొత్తంగా ఈ రెండు సినిమాలు తొమ్మిది అవార్డులు దక్కించుకున్నాయి. ఇక ఎవరెవరికి ఏయే అవార్డు వచ్చిందనేది ఇప్పుడు చూద్దాం..